Just EntertainmentLatest News

Spider-Man : బాక్సాఫీస్ వద్ద స్పైడర్ మ్యాన్ రికార్డుల సునామీ.. ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవడానికి అదే కారణమా?

Spider-Man : హాలీవుడ్‌లో సూపర్‌హీరో మూవీల పని అయిపోయింది. ఆడియన్స్ ఈ కథలకు విసిగెత్తిపోయారంటూ వస్తున్న వార్తలకు పవర్ ఫుల్ చెక్ పెడుతూ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ క్రియేట్ చేస్తోంది.

Spider-Man

ఈమధ్య కాలంలో హాలీవుడ్‌లో సూపర్‌హీరో మూవీల పని అయిపోయింది. ఆడియన్స్ ఈ కథలకు విసిగెత్తిపోయారంటూ వస్తున్న వార్తలకు పవర్ ఫుల్ చెక్ పెడుతూ స్పైడర్ మ్యాన్(Spider-Man) బ్రాండ్ న్యూ డే మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీ క్రియేట్ చేస్తోంది.

సోనీ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే నార్త్ అమెరికా మార్కెట్‌లో ఏకంగా 325 మిలియన్ డాలర్ల కలెక్షన్ దిశగా దూసుకెళ్తోంది. హాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన మూవీ లిస్ట్‌లో ఇది సెకండ్ ప్లేస్‌ను కైవసం చేసుకోవడానికి సిద్ధమైంది.

గ్లోబల్ మార్కెట్‌లో సుమారు 550 మిలియన్ డాలర్లు రాబట్టే అవకావం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా, వరల్డ్ వైడ్‌గా తొలి వీకెండ్‌లోనే ఏకంగా 875 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవచ్చని భావిస్తున్నారు. సుమారు 225 మిలియన్ డాలర్ల నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్ రూపురేఖలనే మార్చేస్తోంది.

ఈ మూవీ సాధిస్తున్న సంచలన విజయానికి చిన్న పిల్లలు, జెన్ జీ యూత్, పెద్దలు ఇలా అన్ని వర్గాలు అనే చెప్పాలి. రిలీజ్ డే నుంచి ఈ చిత్రానికి వీరంతా బ్రహ్మరథం పడుతున్నారు. టామ్ హాలాండ్, జెండయా, సేడీ సింక్ వంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్స్ స్క్రీన్ మీద కనిపించడంతో పాటు, పీటర్ పార్కర్ ఫేస్ చేసే మానసిక సంఘర్షణను, అతని భావోద్వేగాలను చాలా నేచురల్‌గా చూపించడం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రముఖ రేటింగ్ సైట్ రొట్టెన్ టొమాటోస్‌లో ఈ మూవీకి ఏకంగా 98 పర్సంట్ ఆడియన్స్ స్కోర్ లభించడం మరో విశేషం. రొటీన్ సూపర్‌హీరో ఫార్ములాకు డిఫరెంట్‌గా, పీటర్ పార్కర్ పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ మూవీని తీర్చిదిద్దిన శైలిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మూవీ ఆస్కార్ రేసులో నిలిచినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని హాలీవుడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

గతంలో వచ్చిన ది మార్వెల్స్, ది ఫ్లాష్, ఆక్వామాన్ 2 వంటి పెద్ద మూవీలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆడియన్స్‌కు సూపర్‌హీరో జోనర్‌ బోర్ కొట్టిందని అందుకే వాటికి దూరమయ్యారనే టాక్ నడిచింది. అయితే ఆడియన్స్ సూపర్‌హీరోలకు దూరం కాలేదని, కేవలం ఒకేలాంటి మూస కథలకు మాత్రమే బోర్ ఫీలయ్యారని ఈ స్పైడర్ మ్యాన్(Spider-Man) మరోసారి ప్రూవ్ చేసింది.

20 ఏళ్ల నుంచి చూసుకుంటే సోనీ సంస్థ నుంచి వచ్చిన 11వ స్పైడర్ మ్యాన్ ప్రాజెక్ట్ ఇది. గతంలో వచ్చిన స్పైడర్ మ్యాన్(Spider-Man) ఫ్రాంచైజ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, హోమ్‌కమింగ్, ఇంటూ ది స్పైడర్ వర్స్, నో వే హోమ్, అక్రాస్ ది స్పైడర్ వర్స్ వంటి హిట్ మూవీల పక్కన ఇది చేరింది.

అయితే దీనిని పాత కథల సీక్వెల్‌లా కాకుండా దీన్ని ఒక కొత్త స్టోరీలా ప్రమోట్ చేయడం, ట్రైలర్లలో కథను ఎక్కడా లీక్ చేయకుండా క్యూరియాసిటీని పెంచడం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి బాగా ప్లస్ అయింది. పైగా ఈ మూవీని చూడటానికి పాత సినిమాలు చూసి ఉండాల్సిన అవసరం లేకపోవడంతో కామన్ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు రప్పిస్తోంది.

నిజానికి స్పైడర్ మ్యాన్ రోల్‌కు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కనెక్ట్ అవ్వడానికి ఒక బలమైన కారణం ఉందంటారు సినీ క్రిటిక్స్. ఇతను కేవలం సూపర్ పవర్స్ ఉన్న హీరో మాత్రమే కాదు, మనందరిలాగే రోజువారీ జీవితంలో స్కూల్, కాలేజీ, ప్రేమ, కుటుంబ బాధ్యతలు, గిల్ట్, సెల్ఫ్ డౌట్ వంటి రకరకాల సమస్యలు ఎదుర్కొనే ఒక సాధారణ కుర్రాడుగా ఉంటాడు.

Spider-Man
Spider-Man

సూపర్‌హీరో థాట్‌పైనే ఆడియన్స్‌కు విసుగొచ్చిన ఈ సమయంలో కూడా ఇది థియేటర్లలో మెరుపులు మెరిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ హిట్ కొట్టడానికి హీరోకున్న సూపర్ పవర్స్ కారణం కానే కాదు. అతనిలో ఉండే మోస్ట్ నేచురల్ హ్యూమన్ ఎమోషన్స్ మాత్రమే అసలు రీజన్ అంటున్నారు . అందుకే చాలామంది అతనిలో తమను తాము చూసుకుంటున్నారు.

చిన్న పిల్లలకు స్పైడర్ మ్యాన్ వేసుకునే మాస్క్, గాలిలో చేసే స్టంట్స్, వెబ్ స్లింగింగ్ నచ్చితే, టీనేజర్లకు మాత్రం అతడిలో ఉండే గందరగోళం, ప్రేమ భావాలు కనెక్ట్ అవుతాయి. పెద్దవారికి బాధ్యత, త్యాగం, కష్టాలను తట్టుకుని నిలబడే మైండ్ సెట్‌ చూసి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. మొత్తంగా కేవలం విలన్లతో ఫైటింగ్ చేయడమే కాకుండా పీటర్ పార్కర్ పర్సనల్ లైఫ్‌ను టచ్ చేయడంతోనే స్పైడర్ మ్యాన్‌కు అంత స్పెషాలిటీ వచ్చింది.

August 5 : కశ్మీర్ నుంచి రామమందిరం వరకు సేమ్ సెంటిమెంట్.. ఆగస్ట్ 5న నయా హిస్టరీకి కేంద్రం రెడీ?

Related Articles

Back to top button