Just EntertainmentLatest News

Toxic OTT : టాక్సిక్ ఓటీటీ డేట్ ఫిక్స్..ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే యశ్ సందడి చేస్తాడా?

Toxic OTT : బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి టాక్సిక్ తన స్టామిటాను చాటుకుంది. ఇప్పుడు ఈ భారీ యాక్షన్ మూవీ ఓటీటీ లవర్స్‌ను అలరించడానికి రెడీ అవుతోంది.

Toxic OTT

కేజీఎఫ్‌ సిరీస్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ..దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో టాక్సిక్ పాన్-ఇండియా మూవీ భారీ హైప్‌తో ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేసింది.

టాక్సిక్ -ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్..వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ పవర్ ప్యాక్డ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయినా.. బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తన స్టామిటాను చాటుకుంది. ఇప్పుడు ఈ భారీ యాక్షన్ మూవీ ఓటీటీ లవర్స్‌ను అలరించడానికి రెడీ అవుతోంది.

ఈ మూవీ స్టోరీ లైన్ చూస్తే.. 1950 – 60ల నాటి గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నేరాలు, డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్ వార్స్ పీక్స్‌లో ఉన్న ఆ కాలంలో..మంచి చెడుల మధ్య, స్వార్థం బంధాల మధ్య నలిగిపోయే ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ రోల్‌లో యశ్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

Toxic OTT
Toxic OTT

యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి పాన్-ఇండియా యాక్టర్స్ యాక్ట్ చేసినా స్క్రీన్‌ప్లే సరిగ్గా కుదరలేదనే టాక్ వచ్చింది. స్టోరీ ఒకలా అనుకుంటే, షూటింగ్ మరోలా జరిగిందని.. చివరికి ఎడిటింగ్ టేబుల్‌పై మేకర్స్ దాన్ని మరోలా మార్చేశారనే నెగిటివ్ టాక్ ఫిల్మ్ వర్గాల్లో వినిపించాయి.

స్టోరీ స్లోగా ఉండి బోరింగ్ అనిపించినా, కేవలం యశ్ మాస్ ఎలివేషన్స్, గ్లామరస్ క్యారెక్టర్ల కోసమే థియేటర్లకు వెళ్లారు. కాగా సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జీ5 (Zee5) వేదికగా టాక్సిక్ స్ట్రీమింగ్ కానున్నట్లు ట్రేడ్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణపతి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు…ఈసారి 11 రోజులు కాదు 12 రోజుల ఉత్సవాలు

Related Articles

Back to top button