Vijay, Rashmika :విజయ్- రష్మికకు అదిరిపోయే సర్ప్రైజ్ .. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
Vijay, Rashmika : ఈ కొత్త జంట కలిసి నటిస్తున్న కొత్త సినిమా 'రణబాలి' (Ranabaali) మూవీ యూనిట్ నూతన దంపతులకు ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది
Vijay, Rashmika
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి సందడి వేడి ఇంకా తగ్గకముందే.. సినిమా అప్డేట్తో ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న(Vijay, Rashmika ) వివాహం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత ఈ జంట పెద్దల అంగీకారంతో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు.
ఈ సంతోషకరమైన సమయంలో ఈ కొత్త జంట కలిసి నటిస్తున్న కొత్త సినిమా ‘రణబాలి’ (Ranabaali) మూవీ యూనిట్ నూతన దంపతులకు ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీ నుంచి విజయ్ – రష్మిక జంటగా ఉన్న ఒక ప్రత్యేకమైన ఫోటోను రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది.
అయితే రణబాలి టీమ్ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ కూడా వీరి పెళ్లి ఫోటోనే కావడం ..ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రణబాలి మూవీని ఒక పీరియాడికల్ డ్రామాగా ..టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.
గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీల తర్వాత విజయ్ – రష్మిక(Vijay, Rashmika ) మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. కాగా ఈ వెడ్డింగ్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రియల్ లైఫ్‌లోనూ పెళ్లి చేసుకున్న ఈ జంట, రీల్ లైఫ్‌లో కూడా అదే గెటప్‌లో కనిపించడం అందరికీ కనువిందుగా ఉంది.

ఇక భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న రణబాలి మూవీ.. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న మూవీ కావడంతో.. రణబాలి మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ మరోసారి మ్యాజిక్ చేస్తుందని.. పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అటు పర్సనల్ లైఫ్‌లో, ఇటు కెరీర్ పరంగా ఈ జంట ఇప్పుడు కెరీర్లోనే అత్యుత్తమ దశలో ఉన్నారు. మరోవైపు రణబాలి టీమ్ ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ మాత్రం.. ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది.



