Just EntertainmentLatest News

OTT : ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్..ఈ ఓటీటీ థ్రిల్లర్ ను అస్సలు మిస్సవ్వొద్దు

OTT : గత కొంత కాలంగా వెండితెర కంటే ఓటీటీల్లోనే చాలా మూవీస్ సూపర్ హిట్ అవుతున్నాయి. అందులోనూ ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు

OTT

గత కొంత కాలంగా వెండితెర కంటే ఓటీటీల్లోనే చాలా మూవీస్ సూపర్ హిట్ అవుతున్నాయి. అందులోనూ ఓటీటీ(OTT)ల్లో థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్స్ లో ప్రస్తుతం జెట్లీ, గాయపడ్డ సింహం సినిమాలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇటు ఓటీటీ(OTT)లోనూ ఓ సినిమా తెగ ట్రెండ్ అవుతుంది.ఓ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆ థ్రిల్లర్ సినిమా కూడా ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమాలో ప్రతి సీన్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. తెలుగు సినిమాలతో పాటు తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఓటీటీల్లో ఎప్పుడూ అదరగొడుతున్నాయి. అందుకే ప్రేక్షకులు కూడా థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు మాట్లాడుకుంటున్న సినిమా ఓ తమిళ్ సినిమా.. ఈ సినిమా మొదలు నుండి చివరి వరకు థ్రిల్ చేస్తుంది. ఒక్కొక్క సీన్ ఉత్కంఠభరితమైన అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమా పేరు పోర్ తోజిల్. విఘ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్ ప్రధాన పాత్రలు పోషించారు.

OTT
OTT

వాస్తవానికి ఇది తమిళ చిత్రం అయినప్పటికీ, తెలుగులోకి డబ్ చేసారు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికీ ‘పోర్ తోజిల్ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాలో సస్పెన్స్ సన్నివేశాలతో ప్రతి క్షణం ఉత్కంఠకు గురవుతారు. ఓ సైకో కిల్లర్ కొంతమంది ప్రత్యేకంగా ఎంచుకుని చంపుతూ ఉంటాడు. ఒక్క క్లూ కూడా ఉండదు.

దీంతో పోలీసులకు ఈ కేసు ఒక సవాల్ గా మారుతుంది.మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? అతను ఎవరిని చంపుతాడు? ఎందుకు చంపుతాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే, మీరు సినిమాను మొదటి నుండి చివరి వరకు చూడాలి.క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా మంచి చాయిస్. ఇది చిన్న పిల్లలకు కొంచెం భయపెట్టేలా ఉంటుంది. సో పిల్లలతో కలిసి చూడకపోవడం మంచిది.

Coffee : మీరు కాఫీ లవర్సా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Related Articles

Back to top button