Coffee:కాఫీ లవర్స్‌కి ఇది గుడ్ న్యూసే.. యాంటీ ఏజింగ్ డ్రింక్‌గా కాఫీ..మరి ఎలా తీసుకోవాలి.?
Coffee: కాఫీ గింజలలో పాలీఫెనాల్స్, హైడ్రోసిన్నామిక్ యాసిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలు పాడైపోకుండా కాపాడతాయి.
Coffee
వయసు పెరగడమనేది నేచురల్, దానిని ఎవరూ ఆపలేరు. కానీ ఏజ్ పెరిగినా సరే ముసలితనం రాకుండా, ఆ వృద్ధాప్య ఛాయలను వెనక్కి నెట్టడానికి మాత్రం మనం కొన్నికొన్ని పనులు చేయొచ్చు. దీనికోసం రకరకాల కెమికల్ క్రీములు, వేల రూపాయల ఖరీదైన ట్రీట్మెంట్లు వెంట పడతాం. కానీ అసలైన సీక్రెట్ మన వంటింట్లో అది కూడా చాలామంది రోజూ తాగే కాఫీలోనే దాగి ఉందని నిపుణులు అంటున్నారు.
కాఫీ(Coffee) అంటే కేవలం మైండ్ రిలాక్స్ చేయడానికి లేదా బద్ధకాన్ని వదిలించడానికి తాగే ఒక డ్రింక్ మాత్రమే కాదు. ముసలితనంతో పోరాడే ఒక మంచి ఆయుధం కూడా అని చెబుతున్నారు. అయితే కాఫీని ఎలా తాగాలో, ఎన్ని సార్లు తీసుకోవాలో పక్కాగా తెలుసుకోవడం మాత్రం చాలా అవసరం.
చాలామందికి పొద్దున నిద్రలేవగానే వేడివేడి కాఫీ గొంతులో పడకపోతే అసలు రోజే గడవదు. పొద్దుపొద్దున్నే ఆ కాఫీ ఇచ్చే కిక్కే వేరంటారు. నిజమే కాఫీ రోజంతా ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా ముసలితనాన్ని, చర్మంపై వచ్చే ముడతలను కాఫీ చాలా పవర్‌ఫుల్‌గా అడ్డుకుంటుందని స్టడీస్ కూడా చెబుతున్నాయి.
కాఫీ(Coffee)లో ఉండే కొన్ని నేచురల్ గుణాలు బాడీలోని కణాలను ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతాయి. కాఫీ మంచిదే కదా అని పాలు, షుగర్ యాడ్ చేసిన కాఫీ తాగుతాం అంటే కుదరదు.కేవలం బ్లాక్ కాఫీ వల్లే ఈ బెనిఫిట్స్ ఉంటాయట.
రోజుకు ఒకటి, రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగితే వృద్ధాప్య ఛాయలను కొంత కాలం పాటు వాయిదా వేయవచ్చని ఎన్ఎల్ఎమ్ (NLM) అధ్యయనం చెబుతోంది. అందుకే కాఫీని ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా బెస్ట్ యాంటీ ఏజింగ్ డ్రింక్‌గా పిలుస్తున్నారు.
సాధారణంగా మన బాడీలోని కణాలు దెబ్బతినడానికి, ఏజ్ పైబడినట్లు కనిపించడానికి ఫ్రీ రాడికల్స్ అనేవి మెయిన్ కారణం. అయితే కాఫీ గింజలలో పాలీఫెనాల్స్, హైడ్రోసిన్నామిక్ యాసిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలు పాడైపోకుండా కాపాడతాయి.
అంతేకాదు, కాఫీలోని కెఫిన్ మన స్కిన్‌లో రక్తప్రసరణను బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల స్కిన్ లూజ్ అవ్వకుండా టైట్‌గా మారి ముడతలు కూడా త్వరగా రావు. ఎండ వల్ల స్కిన్ పాడవకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాఫీలోని సమ్మేళనాలు ఒక షీల్డ్‌లా రక్షిస్తాయి.

కేవలం స్కిన్ ఒకటే కాదు , మెదడు చురుకుదనానికి కూడా ఇది తోడ్పడుతుంది. వయసు పెరిగే కొద్దీ చాలామందికి మతిమరుపు, పార్కిన్సన్స్ వంటి నరాల బలహీనత వ్యాధులు వస్తుంటాయి.
బ్లాక్ కాఫీని రెగ్యులర్‌గా తాగడం వల్ల బ్రెయిన్ కణాలు ఉత్తేజితమై జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాఫీ మెదడు ముసలిబారిపోకుండా కాపాడుతుంది. వీటితో పాటు వృద్ధాప్యంలో వచ్చే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులతో పాటు లివర్ సమస్యల ముప్పును కూడా ఇది తగ్గిస్తుందని అధ్యయనం వెల్లడించింది. బాడీ లోపల ఏర్పడే ఇన్ఫ్లమేషన్ అంటే మంట లేదా వాపును తగ్గించడం ద్వారా కాఫీ ఈ అద్భుతాన్ని చేస్తుంది.
అయితే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ తాగకూడదు. రోజుకు రెండు, మూడు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. అతిగా తాగితే నిద్రలేమి, గ్యాస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.





