HealthLatest News

Watermelon : అతిగా పుచ్చకాయ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట!

Watermelon : ఎంత మంచిదైనా సరే అతిగా తింటే అది అనర్థాలకు దారితీస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇప్పుడు పుచ్చకాయ (Watermelon) విషయంలోనూ ఆరోగ్య నిపుణులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.

Watermelon

వేసవి తాపం నుంచి రిలీఫ్ పొందడానికి చాలామంది పుచ్చకాయను తెగ తీసుకుంటారు. సుమారు 92 శాతం నీరు ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్-ఎ, సి, పొటాషియంతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపీన్ వంటి పోషకాలు కూడా దీనిలో చాలా ఎక్కువగా ఉంటాయి.

అయితే, ఎంత మంచిదైనా సరే అతిగా తింటే అది అనర్థాలకు దారితీస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇప్పుడు పుచ్చకాయ (Watermelon) విషయంలోనూ ఆరోగ్య నిపుణులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. పుచ్చకాయను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుందట. ఇందులో ఉండే సార్బిటాల్ అనే షుగర్ సమ్మేళనం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు.

ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిలో నేచురల్ షుగర్స్ ఉన్నా సరే , దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అలాగే, గుండె ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు పుచ్చకాయలో పొటాషియం చాలా సమృద్ధిగా ఉంటుంది. సాధారణంగా ఇది గుండెకు మంచిదే అయినా సరే, శరీరంలో పొటాషియం మోతాదు ఎక్కువైతే (Hyperkalemia) మాత్రం హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గులు , బలహీనమైన పల్స్ రేట్ వంటి సమస్యలు రావచ్చు.

Watermelon
Watermelon

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఓవర్ హైడ్రేషన్ సమస్య కూడా తలెత్తొచ్చు. పుచ్చకాయ(Watermelon)లో నీటి శాతం ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. దీని వల్ల శరీరంలో నీటి నిల్వలు పెరిగి సోడియం స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల కాళ్ల వాపులు, అలసట , కిడ్నీలపై అదనపు భారం పడుతుంది.

ముఖ్యంగా రాత్రి సమయాల్లో దీనికి దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారు కూడా పుచ్చకాయను అతిగా తినకపోవడం మంచిది, ఎందుకంటే ఇది కాలేయ వాపునకు దారితీసే ప్రమాదం ఉంది. మొత్తంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 300 గ్రాముల వరకు మాత్రమే పుచ్చకాయను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Kidney Stones :కిడ్నీ రాళ్లను పిండి చేసే ఆకు..ఈ సంజీవని గురించి విన్నారా?

Related Articles

Back to top button