HealthLatest News

Bael Fruit:క్యాన్సర్ రోగులకు సంజీవని.. బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలను కరిగించే అద్భుతమైన పండు

Bael Fruit: సమ్మర్ సీజన్‌లో ఈజీగా లభించే మారేడు పండు (Bael Fruit) గుజ్జులో బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నాశనం చేసే అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నట్లు స్టడీలో తేలింది.

Bael Fruit

ప్రపంచవ్యాప్తంగా మెడికల్ సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బుల పేరు వింటేనే రోగులు, వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతుంటారు. దేశవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ డిసీజ్ కేవలం మహిళల్లోనే కనిపిస్తుందని అనుకునేవారు, కానీ మారుతున్న లైఫ్‌స్టైల్ వల్ల ఇప్పుడు పురుషులు కూడా దీని బారిన పడుతుండటమే ఇప్పుడు కలవరపెడుతోంది.

దీంతో క్యాన్సర్‌కు ఒక పవర్‌ఫుల్ , తక్కువ ఖర్చుతో కూడిన మెడిసిన్ కనుగొనడానికి గ్లోబల్ లెవెల్లో రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. తాజాగా, బీహార్ రాజధాని పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. మనకు సమ్మర్ సీజన్‌లో ఈజీగా లభించే మారేడు పండు (Bael Fruit) గుజ్జులో బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నాశనం చేసే అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నట్లు స్టడీలో తేలింది.

మారేడు పండులో ఉండే క్యాన్సర్ నిరోధక లక్షణాలను (Anti-cancer properties) ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలుకలపై దాదాపు 3 నుంచి 4 ఏళ్ల పాటు సుదీర్ఘమైన ఎక్స్‌పెరిమెంట్స్ చేసింది. ఈ ప్రాసెస్‌లో మొదట ఎలుకలకు ఒక ప్రత్యేకమైన కెమికల్ ఇచ్చి, వాటి బ్రెస్ట్ భాగంలో క్యాన్సర్ గడ్డలు (Tumors) ఏర్పడేలా చేశారు.

ఆ గడ్డలు డెవలప్ అయిన తర్వాత, ఎలుకలకు ప్రతిరోజూ ఒక నిర్దేశిత పరిమాణంలో మారేడు పండు గుజ్జును ఆహారంగా ఇస్తూ వచ్చారు. కొద్దిరోజుల తర్వాత ఎలుకల బాడీని అబ్జర్వ్ చేయగా, వాటిలోని క్యాన్సర్ గడ్డల సైజ్ మెల్లగా కుచించుకుపోయి, చివరికి పూర్తిగా మాయమవడం చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎలుకలు మళ్లీ నార్మల్ హెల్దీ స్టేజ్‌కి వచ్చేసాయి.

మారేడు పండు(Bael Fruit) గుజ్జులో క్యాన్సర్ సెల్స్ గ్రోత్‌ను కంప్లీట్‌గా అడ్డుకునే ఎన్నో రకాల పవర్‌ఫుల్ ఫైటోకెమికల్ కాంపౌండ్స్ (Phytochemical Compounds) ఉన్నట్లు ల్యాబ్ టెస్టుల్లో కనుగొన్నారు. దీనిలో ముఖ్యంగా కెరోటినాయిడ్లు, ఫెనోలిక్ సమ్మేళనాలు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, టెర్పెనాయిడ్లు , స్టెరాయిడ్ సపోనిన్లు వంటి యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి క్యాన్సర్ కణాలు బాడీలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తాయి. ఈ రీసెర్చ్ యొక్క ఇంపార్టెన్స్‌ను రికగ్నైజ్ చేసిన బ్రిటన్‌కు చెందిన వరల్డ్ ఫేమస్ సైన్స్ న్యూస్ పేపర్.. నేచర్ జర్నల్ (Nature Journal) ఈ పరిశోధనా వ్యాసాన్ని పబ్లిష్ చేసింది.

Bael Fruit
Bael Fruit

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. మారేడు గుజ్జులో క్యాన్సర్‌ను క్యూర్ చేస్తున్న నిర్దిష్టమైన మాలిక్యూల్‌ను విడిగా ఐసోలేట్ చేసి, దానిని మళ్లీ టెస్ట్ చేయడమే సైంటిస్టుల ప్లాన్. ఆ డెవలప్‌మెంట్ సక్సెస్ అయిన తర్వాత దీనిపై అఫీషియల్ పేటెంట్ హక్కులు తీసుకుని, ఆ తర్వాత మనుషులపై క్లినికల్ ట్రయల్స్ (Clinical Trials) స్టార్ట్ చేస్తారు.

ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్, థెరపీల ఖర్చులు సామాన్యులకు భరించలేనంతగా మారిపోయాయి. మార్కెట్లో దొరికే కొన్ని క్యాన్సర్ మందుల ధరలు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మారేడు పండు(Bael Fruit )బేస్డ్ గా ఒక ఎఫెక్టివ్ మందును గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురాగలిగితే.. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఖర్చు భారీగా తగ్గిపోతుంది.

Summer Trip : సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ?..చల్లదనాన్ని ఇచ్చే ఈ ప్రాంతాలకు చెక్కేయండి

Related Articles

Back to top button