HealthLatest News

Banana with Curd Rice : పెరుగన్నంలో అరటి పండు కలిపి తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..

Banana with Curd Rice : పూర్వం మన తాతముత్తాతలు పొలాల్లో కష్టపడి పనిచేసేటప్పుడు, గట్ల మీద దొరికే అరటి పండ్లను పెరుగన్నంలో కలిపి తినేవారు. ఆ అలవాటే ఇప్పటి వరకు కొనసాగుతోంది.

Banana with Curd Rice

మన తెలుగువారి భోజన సంప్రదాయంలో పెరుగు అన్నానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంత రకాల కూరలతో తిన్నా, చివర్లో కాస్త పెరుగు అన్నం పడితేనే తృప్తిగా ఉంటుందనే ఫీల్‌ కలుగుతుంది. అయితే చాలామందికి పెరుగన్నంలో అరటి పండు నంజుకుని లేదా కలిపి తినే అలవాటు ఉంటుంది.

పూర్వం మన తాతముత్తాతలు పొలాల్లో కష్టపడి పనిచేసేటప్పుడు, గట్ల మీద దొరికే అరటి పండ్లను పెరుగన్నం(Banana with Curd Rice)లో కలిపి తినేవారు. ఆ అలవాటే ఇప్పటి వరకు కొనసాగుతోంది. అయితే అసలు పెరుగు అన్నంలో అరటి పండు(Banana with Curd Rice) కలిపి తినడం కరెక్టేనా, దీనివల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు.

సాధారణంగా ఉడికించిన ఆహార పదార్థాలతో కలిపి ఎలాంటి పండ్లను కూడా తినకూడదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఫ్రూట్స్ అనేవి చాలా ఈజీగా గంటన్నర లేదా రెండు గంటల్లోనే డైజెస్ట్ అయిపోతాయి. కానీ మనం తినే అన్నం అరగడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

ఎప్పుడైతే మనం రైస్‌తో పాటు పండ్లను కలిపి తింటామో, ఆ ఫ్రూట్స్ కూడా అన్నంతో పాటు ఎక్కువ సమయం పొట్టలోనే ఉండిపోవాల్సి వస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ వేగం తగ్గిపోతుంది. అందుకే పండ్లను ఎప్పుడైనా సరే విడిగా తినడమే హెల్త్‌కు చాలా మంచిది. వీలైతే రాత్రి పూట డిన్నర్‌లో కాస్త ఎర్లీగా కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవడం ఇంకా బెస్ట్ అని సూచిస్తున్నారు. ఎందుకంటే వంద గ్రాముల బనానాలోనే దాదాపు 116 క్యాలరీల హై ఎనర్జీ ఉంటుంది.

అయినా సరే అలవాటు ప్రకారం పెరుగన్నం, అరటి పండు కలిపి తిన్నంత మాత్రాన బాడీకి ఎలాంటి పెద్ద నష్టం జరగదని ఆయుర్వేదం చెబుతుంది. కాకపోతే మీ హెల్త్ కండిషన్ , బాడీ రిక్వైర్మెంట్ బట్టి ఎవరు తినాలో, ఎవరు తినకూడదోనన్న విషయం తెలుసుకోవాలి. ఎవరైతే బరువు పెరగాలని అనుకుంటున్నారో, మంచి కండ బలం , బాడీకి ఫ్యాట్ పట్టాలని కోరుకుంటున్నారో అలాంటి వారికి పెరుగు అన్నం, బనానా కాంబినేషన్ .. ఒక వరం లాంటిది.

అలాగే రోజువారీ జీవితంలో విపరీతమైన ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ట్రై చేసేవారు, హార్డ్ వర్క్ చేసే మనుషులు, బాగా నీరసంగా ఉండేవారు లంచ్ టైమ్‌లో పెరుగన్నంతో పాటు 1 లేదా 2 అరటి పండ్లను హ్యాపీగా తీసుకోవచ్చు.

Banana with Curd Rice
Banana with Curd Rice

ఇక ఓవర్ వెయిట్ ఉండి బరువు తగ్గాలని గట్టిగా ట్రై చేస్తున్నవారు, బాడీలోని ఫ్యాట్ కరిగించుకోవాలి అనుకునేవారు పెరుగన్నం, బనానా కలిపి తినకూడదు.

అలాగే డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు కూడా పెరుగన్నంలో అరటి పండు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను ఒకేసారి పెంచేస్తుంది. వెయిట్ పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునేవారు కూడా దీనికి దూరంగా ఉండటమే మంచిది.

మొత్తంగా పెరుగన్నంలో అరటి పండు కలుపుకొని తినడమనేది తప్పు కాదు. కానీ అది మీ ఆరోగ్య లక్ష్యాలు, మీ బాడీకి ఉన్న అవసరాలపై ఆధారపడి ఉంటుంది. పండ్లను విడిగా తింటే జీర్ణవ్యవస్థకు మరింత ఫ్రీగా ఉంటుంది.

NATO : నాటో వేదికపై స్పెయిన్‌కు ట్రంప్ వార్నింగ్..అమెరికా అధ్యక్షుడి తీరుపై స్పెయిన్ ఫైర్

Related Articles

Back to top button