Bhringraj : హెయిర్ ఫాల్ తగ్గి.. కొత్త జుట్టు పెరగాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి!
Bhringraj : మంచి రిజల్ట్స్ కోసం కేవలం పైపైన ప్యాక్‌లు వేసేస్తే సరిపోదు. ముఖ్యంగా బాడీకి లోపలి నుంచి కూడా మంచి పోషణ అందాలి.
Bhringraj
ఈ రోజుల్లో చాలామందిలో జుట్టు విపరీతంగా రాలిపోవడం, పల్చబడటం, చిన్న వయసులోనే తెల్లబడటం వంటి హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో కేశరాజ్ అంటే జుట్టుకు రాజుగా పేరు పడ్డ బృంగరాజ్(Bhringraj) అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది హెయిర్ రూట్స్‌కు మంచి నూట్రిషన్ అందించి, బలహీనమైన వెంట్రుకలను బలంగా మార్చడంలో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
బృంగరాజ్(Bhringraj) వాడటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా, జుట్టు కుదుళ్లు బాగా బలపడతాయి. స్కాల్ప్ మీద కొత్త హెయిర్ పెరగడానికి ఇది మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. చిన్న ఏజ్‌లోనే జుట్టు తెల్లబడటాన్ని అరికట్టడంతో పాటు చుండ్రు, తల చర్మం డ్రైగా మారడం వంటి సమస్యలను కూడా ఇది ఈజీగా తగ్గిస్తుంది.
ఈ బృంగరాజ్‌తో ఇంట్లోనే ఒక హెయిర్ ప్యాక్ తయారు చేయొచ్చు. ఒక బౌల్లో రెండు నుంచి మూడు స్పూన్ల బృంగరాజ్ పౌడర్, 2 స్పూన్ల ఉసిరికాయ పౌడర్, 4 స్పూన్ల పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు నీట్‌గా అప్లై చేసి, 30 – 40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి. వారానికి ఒక్కసారి ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల హెయిర్ బలంగా, సిల్కీగా, షైనీగా మారుతుంది.
కేవలం హెయిర్ ప్యాక్ మాత్రమే కాదు బృంగరాజ్ ఆయిల్‌తో మసాజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. కొద్దిగా గోరువెచ్చని బృంగరాజ్ నూనెను తలకు పట్టించి, ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. రాత్రంతా ఆయిల్‌ను అలాగే ఉంచేసి, మర్నాడు ఉదయం కెమికల్స్ లేని షాంపూతో వాష్ చేసుకోవాలి. దీనివల్ల స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగై జుట్టు హెల్దీగా పెరుగుతుంది.

మంచి రిజల్ట్స్ కోసం కేవలం పైపైన ప్యాక్‌లు వేసేస్తే సరిపోదు. ముఖ్యంగా బాడీకి లోపలి నుంచి కూడా మంచి పోషణ అందాలి. దాని కోసం ప్రోటీన్, ఐరన్, విటమిన్-డి, బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా రోజుకు సరిపడా వాటర్ తాగాలి. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. జుట్టుకు ఎక్కువ హీట్ ఇచ్చే స్టైలింగ్ మెషీన్స్, కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రోడక్ట్స్ వాడటాన్ని పూర్తిగా తగ్గించాలి.
అలాగే బృంగరాజ్ వంటి సహజమైన చిట్కాలు జుట్టు సంరక్షణకు తోడ్పడతాయి. కానీ విపరీతంగా, అకస్మాత్తుగా జుట్టు రాలిపోతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా డెర్మటాలజిస్ట్‌ను కలిసి అసలు కారణం తెలుసుకోవడం మంచిది.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు సర్జరీ సక్సెస్..2 నెలల తర్వాత మరో ఆపరేషన్ ఉంటుందా?





