HealthLatest News

Brain Problems : మెదడులోని ఆ ఒక్క స్విచ్ నొక్కితే చాలు..అల్జీమర్స్, హంటింగ్టన్ వ్యాధులకు బ్రేక్ వేయొచ్చట..

Brain Problems : వృద్ధాప్యానికి, బ్రెయిన్ డిసీజెస్‌కి ఉన్న కనెక్షన్ ఏంటో అనేది ఇన్ని రోజులూ మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై తాజాగా జర్మనీలోని సైంటిస్టులు డీప్ రీసెర్చ్ చేపట్టారు.

Brain Problems

ఏజ్ పైబడే కొద్దీ మనుషుల్లో మెమరీ పవర్ తగ్గడం, నరాల వీక్నెస్ రావడం, బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వంటివి చాలామందిని ఇబ్బంది పెడతాయి. ఏజ్ అయిపోతోంది కదా, ఆ మాత్రం బ్రెయిన్ ప్రాబ్లెమ్స్ రావడం సహజం అని అంతా సరిపెట్టుకుంటాం. కానీ అసలు ఏజ్ పెరగడానికి, ఈ భయంకరమైన బ్రెయిన్ సమస్యలు రావడానికి మధ్యనున్న ఒక సీక్రెట్ లింక్‌ను సైంటిస్టులు ఇప్పుడు కనిపెట్టేశారు.

బ్రెయిన్‌లో ఉండే ఒక చిన్న ప్రోటీన్ ఆన్ అయితే .. అది బ్రెయిన్ కణాలను మెల్లగా విషపూరితం చేస్తోందని జర్మనీ రీసెర్చర్స్ గుర్తించారు. దీంతో ఈ కనపడని మాలిక్యులర్ స్విచ్ సంగతి ఏంటి? ఇది రానున్న రోజుల్లో న్యూరో డిసీజెస్‌ను ఎలా తుడిచిపెట్టబోతోందో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

ఏజ్ పెరిగే కొద్దీ ఏఎల్ఎస్ (ALS), హంటింగ్టన్ వంటి నరాల క్షయ (న్యూరోడిజెనరేటివ్) వ్యాధులు దాడి చేసే డేంజర్ పెరిగిపోతుంది. అయితే అసలు వృద్ధాప్యానికి, ఈ బ్రెయిన్ డిసీజెస్‌కి ఉన్న కనెక్షన్ ఏంటో అనేది ఇన్ని రోజులూ మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై తాజాగా జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ కొలోన్ (CECAD) క్లస్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ సైంటిస్టులు డీప్ రీసెర్చ్ చేపట్టారు. దీనిలో భాగంగా వాళ్లు ముందుగా సీనోరాబ్డిటిస్ ఎలిగాన్స్ (Caenorhabditis elegans ) అనే ఒక రకమైన చిన్న నెమటోడ్ పురుగులపై ఈ ప్రయోగాలు చేశారు.

ఈ రీసెర్చ్‌లో సైంటిస్టులకు ఈపీఎస్8(EPS8 )అనే వృద్ధాప్య ప్రోటీన్ కనిపించింది. మనుషుల్లోనూ,ఇతర జీవుల్లో ఏజ్ పెరిగే కొద్దీ ఈ ప్రోటీన్ పరిమాణం బ్రెయిన్‌లో విపరీతంగా పేరుకుపోతుందని సైంటిస్టులు గమనించారు. ఈ ఈపీఎస్8(EPS8) ప్రోటీన్ స్థాయిలు పెరిగినప్పుడు, అది బాడీ లోపల ఆర్‌ఏసీ (RAC) అనే ఒక సిగ్నలింగ్ మార్గాన్ని విపరీతంగా ఓవర్ యాక్టివేట్ చేసేస్తుంది.

ఈ రూట్ ఓవర్ యాక్టివ్ అవ్వడం వల్ల మెదడు సెల్స్‌లో డేంజర్ అయిన, విషపూరితమైన ప్రోటీన్లు ఒకదానికొకటి గట్టిగా అతుక్కుపోయి పెద్ద కమ్యూనిటీస్‌గా మారిపోతాయి. ఇవి న్యూరాన్స్ పనితీరును పూర్తిగా దెబ్బతీసి, చివరకు న్యూరోడిజెనరేషన్ లేదంటే బ్రెయిన్ కణాలు చనిపోయేలా చేస్తాయి.

అయితే సైంటిస్టులు ఒక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని తెలుసుకున్నారు. వాళ్లు ల్యాబొరేటరీలో ఈ EPS8 ప్రోటీన్ యాక్టివేషన్ లేదంటే దాని ఎఫెక్ట్ తగ్గించినప్పుడు, మైండ్‌లో ఆ విషపూరిత ప్రోటీన్ క్లస్టర్లు ఏర్పడటం ఆగిపోయింది. ఏఎల్ఎస్, హంటింగ్టన్ డిసీజెస్‌తో బాధపడుతున్న ఆ పురుగు నమూనాల్లో నరాల పనితీరు మళ్లీ నార్మల్‌గా, చాలా బాగా మారడం కనిపించింది. అంటే ఈ EPS8 అనే స్విచ్‌ను కంట్రోల్ చేయగలిగితే, ఓల్డ్ ఏజ్‌లో వచ్చే బ్రెయిన్ డ్యామేజ్‌ను ఈజీగా అడ్డుకోవచ్చని తేలింది.

ఈ ఫలితాలు కేవలం పురుగులకే లిమిట్ కాకపోవడం విశేషం. ఎందుకంటే మనుషుల బాడీలో కూడా ఈ EPS8 ప్రోటీన్, దాని సిగ్నలింగ్ నెట్‌వర్క్ సంతోషంగా పని చేస్తుంటాయి. అందుకే సైంటిస్టులు ఏఎల్ఎస్, హంటింగ్టన్ డిసీజెస్ ఉన్న మనిషి కణ నమూనాలపై ఎక్స్‌పెరిమెంట్స్ చేయగా.. అక్కడ కూడా EPS8 లెవెల్స్ తగ్గించగానే ఆ విషపూరిత ప్రోటీన్ల కుప్పలు మెల్లగా కరగడం స్టార్ట్ అయింది. ఇది మెడికల్ వరల్డ్‌లో సరికొత్త ఆశలను చిగురింపజేస్తున్నట్లు అయింది.

Brain Problems
Brain Problems

ఫ్యూచర్‌లో ఈ EPS8 సిగ్నలింగ్ రూట్‌ను బ్లాక్ చేసే లేదా కంట్రోల్ చేసే కొత్త మెడిసిన్స్ కనుక మార్కెట్‌లోకి వస్తే.. ఓల్డ్ ఏజ్‌లో వచ్చే భయంకరమైన బ్రెయిన్ డిసీజెస్ తీవ్రతను తగ్గించడం లేదంటే అసలు రాకుండానే కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. అయితే ప్రస్తుతం ఇది కేవలం ల్యాబొరేటరీ అండ్ సెల్ మోడల్స్ స్టేజ్‌లో ఉన్న స్టార్టింగ్ ప్రయోగం మాత్రమే. మనుషులకు పూర్తిస్థాయి చికిత్సగా అందుబాటులోకి రావాలంటే ఇంకా చాలా రకాల క్లినికల్ ట్రయల్స్, సేఫ్టీ టెస్టులు జరగాల్సి ఉంటుంది.

అయినా కూడా నేచర్ ఏజింగ్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఈ రీసెర్చ్..ఏజ్ పెరిగినంత మాత్రాన బ్రెయిన్ వ్యాధులకు లొంగిపోవాల్సిన అవసరం లేదని తేల్చింది. ఆ మాలిక్యులర్ స్విచ్‌ను ఆపేస్తే బ్రెయిన్‌ను లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంచుకోవచ్చనే ప్రూఫ్స్‌ను అందించింది.

Romance In Relationship : రిలేషన్‌షిప్‌లో లవ్ కనిపించడం లేదా? ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవుతుందా?

Related Articles

Back to top button