Just NationalLatest News

Arnab Cyclone : అక్టోబర్ 26న ఆర్నాబ్ తుపాను ఉగ్రరూపం..ఉత్తరాంధ్ర, ఒడిశాకు ఐఎండీ హెచ్చరికలు

Arnab Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆర్నాబ్ తుపానుగా మారుతోంది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాపై దీని ప్రభావం పడనుంది. భారీ వర్షాల హెచ్చరికలు, అధికారుల ముందస్తు చర్యల గురించి ఇక్కడ చూడండి.

Arnab Cyclone

తెలుగు రాష్ట్రాల తీర ప్రాంతాలకు తుపాను గండం పొంచి ఉందనే వార్త వినిపిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని అల్పపీడనం అతి వేగంగా బలపడుతూ తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఈ సీజన్‌లో ఏర్పడుతున్న ఈ మొదటి తుపానుకు ఆర్నాబ్(Arnab Cyclone) అనే పేరును ఖరారు చేశారు. దీని ప్రభావం ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా తీరాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

ఈరోజు అంటే అక్టోబర్ 24వ తేదీకి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి..అక్టోబర్ 25వ తేదీ ఆదివారానికి వాయుగుండంగా పుంజుకుని, అక్టోబర్ 26వ తేదీ సోమవారం ఉదయానికల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఆ తర్వాత ఇది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ అక్టోబర్ 27వ తేదీ, 28 వ తేదీల నాటికి ఉత్తరాంధ్ర,ఒడిశా సరిహద్దు తీరాలకు అతి దగ్గరలోకి చేరుకోబోతోంది. ఇది మరింత ఉగ్రరూపాన్ని దాల్చడంతో.. తీవ్ర లేదా అతి తీవ్ర తుపానుగా మారే ముప్పు కూడా ఉండే అవకాశ ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు ఉన్న కోస్తా జిల్లాల్లో గంటకు 70 – 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మెయిన్‌గా 27, 28 తేదీల్లో చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి లేదా అతి భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి.

దీంతో అటు ఏపీ, ఇటు ఒడిశా ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమై జిల్లా యంత్రాంగాలను అలర్ట్ చేశాయి. సముద్రంలో అలలు విపరీతంగా ఎగసి పడనుండటంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటలు కోతల దశలో ఉండటంతో.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుగానే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Decision : లైఫ్‌లో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? కన్ఫ్యూజన్‌కు ఇలా చెక్ పెట్టండి..

Related Articles

Back to top button