HealthJust LifestyleLatest News

Chrononutrition : క్రోనోన్యూట్రిషన్ అంటే తెలుసా? తెగ ట్రెండ్ అవుతున్న వెయిట్ లాస్ రెమిడీ

Chrononutrition : బరువు తగ్గడానికి మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నామనే దానికంటే.. అసలు ఏ సమయంలో తింటున్నామనేదే అత్యంత ముఖ్యమని ఈ క్రోనోన్యూట్రిషన్ విధానం చెప్తోంది.

Chrononutrition

బరువు తగ్గడం గురించి అనగానే మనకు గుర్తొచ్చేది డైటింగ్‌లు, క్యాలరీలను లెక్కబెట్టడం, ఇష్టమైన ఆహారాలన్నింటినీ దూరం పెట్టడమే. అయితే, ప్రస్తుతం హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్రపంచంలో క్రోనోన్యూట్రిషన్(Chrononutrition) అనే ఒక సరికొత్త విప్లవాత్మక ట్రెండ్ నడుస్తోంది. బరువు తగ్గడానికి మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నామనే దానికంటే.. అసలు ఏ సమయంలో తింటున్నామనేదే అత్యంత ముఖ్యమని ఈ విధానం చెప్తోంది.

ఎలాంటి కఠినమైన పద్ధతులు పాటించకుండా, కేవలం మన బాడీలోని అంతర్గత గడియారానికి అనుగుణంగా ఆహార సమయాలను మార్చుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు.

మనిషి శరీరంలో ప్రకృతిసిద్ధంగా ఒక బయోలాజికల్ క్లాక్ పనిచేస్తూ ఉంటుందట. దీనినే సైన్స్ భాషలో సిర్కాడియన్ రిథమ్ అని పిలుస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనిషి శరీరంలోని జీర్ణక్రియ, హార్మోన్ల రిలీజ్, మెటబాలిజం రేటు వేర్వేరు సమయాల్లో వేర్వేరులా పనిచేస్తాయి.

ఉదయం పూట సూర్యుడి వెలుతురు ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చాలా పక్కాగా జరుగుతుంది. అదే రాత్రి సమయంలో అయితే, శరీరం నిద్రకు ఉపక్రమించేటపుడు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ బయోలాజికల్ క్లాక్‌ను పట్టించుకోకుండా రాత్రి వేళల్లో ఆలస్యంగా హెవీ మీల్స్ తీసుకోవడం వల్లే ఎక్కువమందిలో ఊబకాయం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి.

నిజం చెప్పాలంటే క్రోనోన్యూట్రిషన్ విధానం గురించి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. దీని ప్రకారం మనం రోజూ తినే ఆహారాన్ని సూర్యుడి గమనంతో ముడిపెట్టాలన్న మాట. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ను రాజులాగా భారీగా, పోషకాలతో ఉండేలా తీసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో బాడీ క్యాలరీలను చాలా వేగంగా ఖర్చు చేయగలదు.

ఇక మధ్యాహ్నం భోజనాన్ని కాస్త మితంగా తీసుకోవాలి. ఇక రాత్రి డిన్నర్‌ను సూర్యాస్తమయం లోపు అంటే రాత్రి ఏడు గంటలకల్లా లైట్ ఫుడ్ తీసుకుని ముగించేయాలి. రాత్రి ఏడు దాటిన తర్వాత శరీరం మెటబాలిజంను తగ్గించి మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్‌ను రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో తింటే ఆహారం సరిగ్గా అరగక, అదంతా కొవ్వు రూపంలో పేరుకుపోయి బరువు పెరిగేలా చేస్తుంది.

Chrononutrition
Chrononutrition

ఈ క్రోనోన్యూట్రిషన్(Chrononutrition) పద్ధతిని అలవాటు చేసుకోవడం ద్వారా వెయిట్ తగ్గడం మాత్రమే కాకుండా, బాడీ లోని హార్మోన్ల అసమతుల్యత పూర్తిగా అదుపులోకి వస్తుంది. ముఖ్యంగా మహిళలను వేధించే పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలతో పాటు పురుషుల్లో వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ టూ డయాబెటిస్, విపరీతమైన పొట్ట రావడం వంటి సమస్యలకు ఇది నేచురల్ రెమిడీగా మారుతుంది.

అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేలా ఎలాంటి క్రేజీ డైట్లు చేస్తూ బాడీని ఇబ్బంది పెట్టకుండా, మన లైఫ్ స్టైల్‌ను ప్రకృతి నియమాలకు అనుగుణంగా మార్చుకుంటే చాలు. తినే టైమింగ్స్‌ను క్రమశిక్షణతో పాటిస్తే హెల్దీగా, ఫిట్‌గా మారడం చాలా ఈజీ అవుతుంది.

Blue Moon :3 ఏళ్ల తర్వాత అరుదైన బ్లూ మూన్ వింత..భారత్‌లో ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా?

Related Articles

Back to top button