Just SportsLatest News

RCB vs GT : గెలుపు బాట పట్టేదెవరు ?..ఆర్సీబీతో గుజరాత్ ఢీ

RCB vs GT : ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో హోం గ్రౌండ్ మ్యాచ్ కు రెడీ అయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది

RCB vs GT

ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో హోం గ్రౌండ్ మ్యాచ్ కు రెడీ అయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్(RCB vs GT) తో తలపడబోతోంది. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 6 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు నాలుగింటిలో గెలిచింది.

రెండింటిలో పరాజయం పాలైంది. గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే ఆర్సీబీ ఓటమికి కారణం. ఫిల్ సాల్ట్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. కానీ ఓవరాల్ గా ఆర్సీబీ మాత్రం తన హోదాకు తగ్గట్టే ఆడుతోంది. టాపార్డర్ , మిడిలార్డర్ బ్యాటర్లంతా గెలిచిన మ్యాచ్ లలో అద్భుతంగా రాణించారు.

కోహ్లీతో పాటు పటిదార్, పడిక్కల్ , టిమ్ డేవిడ్ విధ్వంసకర బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు. అటు బౌలింగ్ లో భువనేశ్వర్ సారథ్యంలోని పేస్ ఎటాక్ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా భువీ అద్భుతమైన బౌలింగ్ తో తన పేస్ లో పసతగ్గలేదని నిరూపిస్తున్నాడు. భువీతో పాటు హ్యాజిల్ వుడ్, రసిక్ సలామ్ దార్ నిలకడగా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తమ మ్యాజిక్ చూపిస్తున్నారు.కృనాల్ అయితే ఆర్సీబీకి వికెట్లు తీసే స్పిన్నర్ గా మారిపోయాడు. గత సీజన్ లోనూ భువీ, కృనాల్ ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.

RCB vs GT
RCB vs GT

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పరాజయం పాలైంది. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి మూడు ఓడిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఆరో ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ జట్టుకు బ్యాటింగే ప్రధాన బలం. కెప్టెన్ శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, షారూఖ్ ఖాన్ లాంటి హిట్టర్లు ఉన్నారు.

ముఖ్యంగా గిల్, బట్లర్ సూపర్ ఫామ్ తో భారీస్కోర్లు అందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ పై వీరిద్దరూ రాణించకపోడమే ఓటమికి కారణమైంది. అటు వాషింగ్టన్ సుందర్ కూడా రాణిస్తున్నాడు. బౌలింగ్ లో చూసుకుంటే కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ అదరగొడుతున్నారు.

రబాడ ఆరంభ మ్యాచ్ లలో నిరాశపరిచినా ఇప్పుడు గాడిలో పడ్డాడు. స్పిన్ విభాగంలో మాత్రం రషీద్ ఖాన్ ఇంకా మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కాగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న చిన్నస్వామి స్టేడియం పిచ్ పై పరుగుల వరద పారడం ఖాయమని చెప్పొచ్చు.

Voters : తమిళనాడులో 85… బెంగాల్ లో 90 శాతం..రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు

Related Articles

Back to top button