HealthJust LifestyleLatest News

Coffee : మీరు కాఫీ లవర్సా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Coffee : పొద్దున్నే ఒక కప్పు కాఫీ తాగకపోతే చాలా మందికి రోజు మొదలయినట్లే ఉండదు. ఇంట్లో ఉన్నా , ఆఫీసు పనిలో బిజీగా ఉన్నా ఒక కప్పు కాఫీ తాగితే ఆ ఉత్సాహమే వేరు అన్నట్లుగా ఫీలవుతారు

Coffee

పొద్దున్నే ఒక కప్పు కాఫీ(Coffee) తాగకపోతే చాలా మందికి రోజు మొదలయినట్లే ఉండదు. ఇంట్లో ఉన్నా , ఆఫీసు పనిలో బిజీగా ఉన్నా ఒక కప్పు కాఫీ(Coffee) తాగితే ఆ ఉత్సాహమే వేరు అన్నట్లుగా ఫీలవుతారు. అయితే కాఫీని పద్ధతిగా తాగితే మంచిదే కానీ ఇష్టం అని అదే పనిగా అతిగా తాగితే మాత్రం ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ , యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. దీనివల్ల మానసిక అలసట తగ్గి పనిపై ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల వరకు కాఫీ తాగడం మంచిదే. ఇలా కాఫీ తాగేవారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను అదుపులో ఉంచడానికి సాయపడుతుంది. అలాగే కాలేయానికి సంబంధించిన ఫ్యాటీ లివర్ సమస్యలు రాకుండా చూడటంతో పాటు.. కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడటంలోనూ కాఫీలోని పోషకాలు తోడ్పడతాయట.

అంతేకాదు మీరు బరువు తగ్గాలని అనుకున్నవారు ఎవరైనా సరే ఎక్సర్‌సైజ్ చేసే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఒంట్లో కొవ్వు త్వరగా కరుగుతుంది. ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేయడమే కాకుండా స్కిన్ మెరిసేలా ఉండటానికి , జుట్టు పెరగడానికి కూడా సాయపడుతుంది.

Coffee
Coffee

అయితే కాఫీ టేస్ట్ బాగుంటుంది ,అలాగే తాగాక మైండ్‌కు బాగుంటుందని రోజుకు నాలుగు ఐదు కప్పుల కంటే ఎక్కువగా తాగితే మాత్రం బాడీలో కెఫిన్ ఎక్కువై సమస్యలు మొదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం , విపరీతమైన ఆందోళన కలగడం వంటివి జరుగుతాయి. కెఫిన్ మోతాదు పెరిగితే గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు రక్తపోటు అంటే బీపీ పెరగడం వంటి ఇబ్బందులు కూడా రావొచ్చు.

ముఖ్యంగా గర్భిణీలు , గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు అయితే ఒక కప్పు కాఫీ వరకూ ఓకే కానీ అంతకంటే ఎక్కువ తాగే అలవాటుంటే మాత్రం.. డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా సరే అతి ఎప్పుడూ అనర్థమే అనుకుని.. హద్దులో ఉన్నప్పుడే అది మనకు అమృతంలా పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే కాఫీని ఎంజాయ్ చేయాలి కానీ దాని వల్ల ఆరోగ్యానికి నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి.

Mumbai Indians : ముంబైకి డూ ఆర్ డై..చెన్నైతో కీలక మ్యాచ్

Related Articles

Back to top button