HealthLatest News

Collagen : బ్యూటీ ప్రపంచంలో కొల్లాజెన్.. అసలు ఇది బాడీకి ఎందుకంత ఇంపార్టెంట్?

Collagen : సాధారణంగా వయసు పెరిగేకొద్దీ మన బాడీలో ఈ కొల్లాజెన్ ప్రొడక్ట్స్ నేచురల్‌గానే తగ్గుతూ వస్తుంది

Collagen

ప్రస్తుతం హెల్త్ అండ్ బ్యూటీ వరల్డ్‌లో ఎక్కడ చూసినా కొల్లాజెన్(Collagen) అనే పేరే వినిపిస్తోంది. యవ్వనంగా కనిపించాలన్నా, స్కిన్ మెరిసిపోవాలన్నా కొల్లాజెన్ చాలా అవసరమని సెలబ్రిటీలు కూడా అంటున్నారు. అసలు కొల్లాజెన్ అంటే ఏంటి?  ఇది మన బాడీలో ఏం చేస్తుంది అనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి.

గ్రీకు భాషలో కొల్లా అంటే జిగురు అని అర్థం. అంటే మన బాడీలోని బోన్స్, చర్మం, కండరాలు, నరాలు ఒకదానికొకటి ఊడిపోకుండా గట్టిగా అతుక్కుని ఉండటానికి ఈ ప్రొటీనే మెయిన్ రీజన్. ఇంకా చెప్పాలంటే ఇది మన బాడీలో ఉండే ఒక రకమైన అదృశ్య జిగురు వంటిదన్నమాట. మన బాడీలో ఎక్కువగా ఉండే ప్రొటీనే కూడా ఇదే.

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ మన బాడీలో ఈ కొల్లాజెన్(Collagen) ప్రొడక్షన్ నేచురల్‌గానే తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా 20 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాది ఒక శాతం చొప్పున ఇది తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. బాడీలో కొల్లాజెన్ తగ్గడం వల్లే స్కిన్‌కు ఉండే సాగే గుణం, బిగుతూ తగ్గిపోతాయి.

దీనివల్ల స్కిన్‌పై ముడతలు రావడం, మచ్చలు పడటం, స్కిన్ లూజ్ అయి సాగడం వంటి ముసలితనపు ఛాయలు కనిపిస్తాయి. కేవలం స్కిన్ మాత్రమే కాదు, మన బోన్స్ జాయింట్ల మధ్య ఉండే కార్టిలేజ్ అనే మెత్తటి ఎముక దెబ్బతినకుండా చూసేది కూడా కొల్లాజెనే.

ఇది తగ్గితేనే ఏజ్ పైబడిన వారిలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎముకలు లోపల గుల్లబారిపోకుండా గట్టిగా ఉంచడానికి, హెయిర్ స్ట్రాంగ్ గా పెరగడానికి, గోళ్లు విరిగిపోకుండా హెల్దీగా ఉండటానికి కూడా ఈ ప్రొటీన్ చాలా ముఖ్యం.

మరి ఇంత ఇంపార్టెంట్ అయిన కొల్లాజెన్ డైరెక్టుగా జంతు సంబంధిత ఆహారాల్లో మాత్రమే ఉంటుంది. మొక్కల ఆధారిత శాకాహారంలో కొల్లాజెన్ ఉండదు. కానీ మన బాడీ ఓన్‌గా కొల్లాజెన్‌ను తయారు చేసుకోవడానికి కావలసిన అమైనో ఆమ్లాలు, విటమిన్లను అందిస్తాయి.

నాన్-వెజిటేరియన్ల విషయానికి వస్తే, చికెన్, మటన్ బోన్స్‌ను ఎక్కువసేపు మరిగించి చేసే ఎముకల సూప్ లేదా బోన్ బ్రోత్‌లో కొల్లాజెన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే చికెన్ స్కిన్, చేపల స్కిన్, గుడ్డు తెల్లసొనలో కొల్లాజెన్ తయారీకి కావలసిన ప్రోలిన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా దొరుకుతుంది.

ఇక వెజిటేరియన్ల విషయానికి వస్తే, మన బాడీ కొల్లాజెన్‌ను సొంతంగా తయారు చేయాలంటే విటమిన్ సి, జింక్, కాపర్ వంటివి చాలా అవసరం. నిమ్మకాయలు, నారింజ, బత్తాయి, కివి, స్ట్రాబెర్రీ, ఉసిరి వంటి సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని బాడీలో స్పీడప్ చేస్తుంది. వీటితో పాటు పాలకూర, బ్రోకలీ, క్యాప్సికమ్, టొమాటోలు వంటి కూరగాయలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలలో ఉండే జింక్, కాపర్ కొల్లాజెన్ తయారీకి బాగా హెల్ప్ అవుతాయి.

Collagen
Collagen

మంచి ఫుడ్ తీసుకోవడంతో పాటు, మన బాడీలో ఆల్రెడీ ఉన్న కొల్లాజెన్ నాశనం కాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎక్కువ షుగర్ లేదా స్వీట్లు తినడం వల్ల బాడీలో కొల్లాజెన్ గట్టిపడి విరిగిపోతుంది. అలాగే సన్‌స్క్రీన్ వాడకుండా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అల్ట్రావయలెట్ రేస్ స్కిన్‌లోని కొల్లాజెన్‌ను త్వరగా ముక్కలు చేస్తాయి.

స్మోకింగ్ వల్ల కూడా బాడీలో కొల్లాజెన్ ప్రొడక్షన్ పూర్తిగా పడిపోతుంది. మార్కెట్లో దొరికే కాస్ట్లీ కొల్లాజెన్(Collagen) పౌడర్లు, సప్లిమెంట్ల వెంట పరుగులు పెట్టే కంటే, విటమిన్ సి, మంచి ప్రొటీన్లు ఉన్న  నేచురల్ ఫుడ్స్ తీసుకోవడం, ఎండ నుంచి స్కిన్‌ను కాపాడుకోవడం అన్నిటికన్నా బెస్ట్ అండ్ సింపుల్ వే.

Netanyahu : ట్రంప్ డీల్‌పై ఇజ్రాయిల్ గరంగరం.. ఇరాన్‌ను వదలనంటున్న నెతన్యాహు

Related Articles

Back to top button