HealthJust LifestyleLatest News

Brain : ఆకలి, నొప్పి, అలసట..మనల్ని సేఫ్‌గా ఉంచడానికి బ్రెయిన్ చెప్పే అబద్ధాలట.

Brain : డైలీ లైఫ్‌లో మనకు అనిపించే ఆకలి, అలసట, పెయిన్ వంటి ఫీలింగ్స్ అన్నీ ఎప్పుడూ వంద శాతం నిజం కావు.

Brain

మన బాడీ ఒక అద్భుతమైన మిషన్. అది మనల్ని ఎప్పటికప్పుడు ఇతర ప్రమాదాల నుంచి కాపాడుతూనే ఉంటుంది. అయితే, మనల్ని సేఫ్‌గా ఉంచడానికి మన శరీరమే మనతో కొన్ని అబద్ధాలు చెబుతుందట. ఈ మాటలు వినడానికి వింతగా ఉన్నా అక్షరాలా నిజం.

డైలీ లైఫ్‌లో మనకు అనిపించే ఆకలి, అలసట, పెయిన్ వంటి ఫీలింగ్స్ అన్నీ ఎప్పుడూ వంద శాతం నిజం కావు. కొన్నిసార్లు మన బ్రెయిన్(Brain) మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసమో, ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంచడం కోసమో మనకు తెలీకుండానే ఒక మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుందట. మనకు వచ్చే సిగ్నల్స్‌ వెనుకున్న అసలు సీక్రెట్స్‌ అన్నిటిని మన శరీరం దాచేస్తూ, మనతోనే మైండ్ గేమ్స్ ఆడుతుంటుంది.

ఉదాహరణకు, కడుపు నిండా బిర్యానీ తిన్న గంటకే మళ్లీ ఏదో ఒకటి తింటే బాగుణ్ణు అన్న క్రేవింగ్స్ వస్తుంటాయి. దీనికి కారణం కడుపు నిండుగా ఉన్నా కూడా బ్రెయిన్ .. ఆకలి వేస్తోంది, త్వరగా ఏదో ఒకటి ఇవ్వు అంటూ సిగ్నల్స్ పంపించడమే. నిజానికి అక్కడ ఆహారం అవసరం లేదు.

కేవలం బోర్ కొట్టడం వల్లనో, లేదా బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గి డీహైడ్రేషన్ అవ్వడం వల్లనో బ్రెయిన్ ఆకలి అనే అబద్ధాన్ని చెబుతుంది. మనం దాన్ని నిజంగా ఆకలి అనుకుని ఏదొకటి లాగించేస్తుంటాం. కానీ, నిజానికి ఒక గ్లాస్ వాటర్ తాగితే ఆ ఫుడ్ క్రేవింగ్ వెంటనే మాయమైపోతుంది. అంటే బాడీకి నీళ్లు కావాల్సి వస్తే, అది మనకు దాహం అని చెప్పకుండా ఆకలి రూపంలో అబద్ధం చెప్పి మోసం చేస్తుందన్నమాట.

అలాగే అలిసిపోవడం అన్న విషయంలో కూడా అదే జరుగుతుంది. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు..ఇక నా వల్ల కాదు, నా బాడీ అలిసిపోయింది, ఇక కంటిన్యూ చేయలేనని బ్రెయిన్ వెంటనే గివప్ ఇచ్చేయమంటుంది.

కానీ ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతుందంటే మన బాడీలో ఇంకా నలభై శాతం ఎనర్జీ మిగిలి ఉండగానే బ్రెయిన్ అలసట అనే అబద్ధపు సిగ్నల్‌ను మనకు పంపించేస్తుంది. ఎందుకంటే, లోపల ఉన్న రిజర్వ్ శక్తి మొత్తం ఖర్చయిపోతే శరీరం ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అని బ్రెయిన్ ముందే భయపడి మనల్ని ఆపేస్తుంది. ఆ అబద్ధాన్ని కాస్త దాటుకుని కొంచెం ముందుకు వెళ్తే, మనలో ఎంత స్టామినా ఉందో మనకే తెలిసిపోతుంది.

Brain
Brain

ఇక పెయిన్ విషయానికి వస్తే, నొప్పి అనేది నిజంగా ఒక పెద్ద భ్రమ. దెబ్బ తగిలినప్పుడు పెయిన్ రావడం మామూలే. కానీ కొన్నిసార్లు ఆ గాయం తగ్గిపోయినా సరే అక్కడ ఇంకా నొప్పి ఉన్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్(Brain)ఆ ప్లేస్‌ను ఇంకా ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తుంది. అందుకే మనల్ని అలర్ట్‌గా ఉంచడానికి పెయిన్ అనే సిగ్నల్‌ను కంటిన్యూ చేస్తుంది.

ఇలా మన బ్రెయిన్ చెప్పే ప్రతి అబద్ధం వెనుక మనల్ని కాపాడాలనే ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి, నెక్స్ట్ టైమ్ తిన్న కాసేపటికే ఆకలి వేసినా, లేదా అలిసిపోయినట్లు అనిపించినా సరే.. అది నిజమైన సిగ్నలా లేక మనల్ని కాపాడటానికి బ్రెయిన్ ఆడుతున్న డ్రామానా అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందన్న మాట.

Mind Reading AI : నెక్స్ట్ ఏం చేస్తావో చెప్పేసే ఏఐ వస్తే..మైండ్ రీడింగ్ నిజంగానే సాధ్యం అవుతుందా?

Related Articles

Back to top button