Aakakarakaya : ఆకాకరకాయలను లైట్ తీసుకోకండి.. రుచే కాదు డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలోనూ ది బెస్ట్..
Aakakarakaya : ఎండాకాలంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొట్టడంలో ఆకాకరకాయ కూర ఎంతగానో సహకరిస్తుంది.
Aakakarakaya
వేడి వేడి అన్నంలో పప్పుచారు కానీ సాంబారు కానీ పోసుకుని, దానికి కాంబినేషన్‌గా ఆకాశ కాకరకాయ కూర ఉంటే ఆ భోజనమే వేరు అంటారు భోజనప్రియులు. అయితే కేవలం రుచి కోసమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఈ కూరకు ఎంతో ప్రాముఖ్యత ఉందంటారు ఆయుర్వేద నిపుణులు.
ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం)ను కంట్రోల్ చేయడంలో ఆకాశ కాకరకాయ(Aakakarakaya) అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడమే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.
ఆకాశ కాకరకాయ(Aakakarakaya)ను బోడ కాకరకాయ , ఆకాకరకాయ, నించుడుకాయ అని కూడా పిలుస్తారు. ఈ కూరను తయారు చేయడం చాలా ఈజీ. ముందుగా పావు కిలో ఆకాకరకాయలను తీసుకుని బాగా కడిగి గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు , పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.

ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి బంగారు రంగులోకి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆకాకర కాయ ముక్కలను కూడా వేసి తక్కువ మంటపై నిదానంగా ఉడికించాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు , కారం వేసి మరికొంత సేపు వేయించాలి.
ఈ కూర గుజ్జులా తయారై నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే ఆకాకర కాయ లేదా బోడ కాకరకాయ కూర రెడీ అవుతుంది. కాకరకాయను దూరం పెట్టేవారు కూడా ఈ ఆకాకరకాయ కూరను చాలా ఇష్టంగా తింటారు.
ఎండాకాలంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొట్టడంలో ఆకాకరకాయ కూర ఎంతగానో సహకరిస్తుంది. పప్పుచారుతో కలిపి తింటే దీని రుచి రెట్టింపు అవుతుంది. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ను ఇష్టపడే వారు ఈ కూరను తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Peddamma Thalli:జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం.. ఈ దివ్య క్షేత్రం గురించి మీకీ సంగతులు తెలుసా?





