Strong Bones : ఈ 3 నేచురల్ ఫుడ్స్‌తో మీ వయసు రివర్స్ .. ఎముకల్లో కూడా కొండంత బలం..
Strong Bones : చాలా మంది నీరసం తగ్గడానికి, బలం కోసం రకరకాల విటమిన్ టాబ్లెట్లు , సిరప్లు వాడుతుంటారు.
Strong Bones
శరీరానికి శక్తి కావాలంటే బయట దొరికే జంక్ ఫుడ్స్ ఏ మాత్రం టచ్ చేయకుండా.. మనకు మంచి చేసే పౌష్టికాహారాన్ని మాత్రమే డైట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా యాక్టివ్‌గా ఉండగలం. చాలా మంది నీరసం తగ్గడానికి, బలం కోసం రకరకాల విటమిన్ టాబ్లెట్లు , సిరప్లు వాడుతుంటారు. అయితే, అలాంటి ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి.. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను గుప్పెడు చొప్పున రోజూ తీసుకుంటే ఎముకలు ఐరన్‌లా గట్టిపడతాయి.
ప్రతిరోజూ మీ డైట్లో కొద్దిగా నువ్వులను చేర్చుకుంటే శరీరానికి ఊహించని ఎనర్జీ వస్తుంది. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం , కీలకమైన విటమిన్లు పుష్కలంగా ఉండటంతో.. ఇవి ఎముకల ఎదుగుదలకు, వాటి డెన్సిటీ పెరగడానికి ఎంతగానో తోడ్పడతాయి. అందుకే రోజువారీ ఫుడ్‌లో నువ్వుల పొడి రూపంలోనో లేదా నువ్వుల లడ్డూ రూపంలోనో వీటిని తీసుకోవడం చాలా మంచిది.ఇది హెయిర్ గ్రోత్‌కు కూడా పనిచేస్తుంది.
ఆరోగ్య విషయానికి వస్తే రాగులు చేసే మేలు అంతా ఇంతా కాదు. నిజానికి పాలతో పోలిస్తే రాగులలోనే కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజూ తగినంత పరిమాణంలో తీసుకోవడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా(Strong Bones )తయారవుతాయి. ముఖ్యంగా ఉదయాన్నే ఆఫీసులకు, ఉద్యోగాలకు వెళ్లేవారు బ్రేక్ ఫాస్ట్‌తో పాటు వేడివేడిగా రాగి జావ తాగితే వీక్నెస్ రాకుండా రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు.

ఎముకల బలహీనతతో బాధపడేవారు, కీళ్ల నొప్పులున్నవారు నానబెట్టిన బాదం పప్పులను రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. బాదంలో కాల్షియంతో పాటు మంచి కొవ్వులు, మెగ్నీషియం వంటి పోషకాలు నిండి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు.. చర్మాన్ని కాపాడి మనం ఎప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన వివరాలు కేవలం ఆరోగ్య నిపుణులు, డైటీషియన్ల సూచనల ఆధారంగా ఇవ్వబడింది. మీ శరీర తత్వాన్ని బట్టి లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలున్నప్పుడు డైట్లో మార్పులు చేసే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
Swiggy Instamart : ఇకపై నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. నయా సేవలను మొదలుపెట్టిన స్విగ్గీ





