HealthLatest News

Hanta virus : టెన్షన్ పెడుతున్న హంటా వైరస్..WHO కీలక ప్రకటన

Hanta virus : కొన్నేళ్ల క్రితం కరోనా వైరస్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. చాలా దేశాల్లో ఈ వైరస్ కారణంగా వేలాది మంది మృత్యువాత పడ్డారు

Hanta virus

కొన్నేళ్ల క్రితం కరోనా వైరస్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. చాలా దేశాల్లో ఈ వైరస్ కారణంగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. తర్వాత దానికి కొనసాగింపుగా కొత్త కొత్త వేరియంట్లు వచ్చినా పలు జాగ్రత్తలతో ప్రపంచం బయటపడింది. అయితే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో కొత్త కొత్త వైరస్ లు దాడి చేస్తూనే ఉన్నాయి.

తాజాగా ప్రపంచ దేశాలను ఓ కొత్త వైరస్ వణికిస్తోంది. దాని పేరే హంటా వైరస్(Hanta virus). క్రూయిజ్ నౌక ఎంవీ హొండియస్‌ కారణంగా ఇది తెరపైకి వచ్చింది. ఈ నౌకలో ప్రయాణించిన వారిలో 8 మందికి హంటావైరస్‌(Hanta virus) సోకినట్లు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. వారిలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. ఈ క్రూయిజ్ షిప్ లో వారు ఎక్కకముందు పలు దేశాల్లో తిరిగినప్పుడు సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ నౌకలో 23 దేశాలకు చెందిన 146 మంది ఉండగా.. స్పెయిన్‌లోని క్యానరీ దీవుల నుంచి వారి వారి స్వదేశాలకు చేరుకోనున్నారు.

కరోనా వైరస్‌ సృష్టించిన మారణహోమం నేపథ్యంలో ఇప్పుడు ఈ హంటా వైరస్ టెన్షన్ పెడుతోంది. ఈ వైరస్‌ను ఆండీస్ వైరస్ అని కూడా పిలుస్తారు. చాలా అరుదైన రకంగా చెప్పుకునే హంటావైరస్‌లు ఎలుకల మలమూత్రాల ద్వారా వ్యాపిస్తాయి. అలాగే మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని గుర్తించారు.

Hanta virus
Hanta virus

ఎలుకల విసర్జితాలను ఊడ్చడం, వాటిని పట్టుకోవడం వంటివి చేసినప్పుడు ఈ వైరస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాస ద్వారా మనుషుల శరీరాల్లోకి సంక్రమిస్తుందని గుర్తించారు. కరోనా తరహాలోనే శ్వాసకోశ ఇబ్బందులు, సాధారణ జలుబు వంటి లక్షణాలే కనిపించినా, వెంటనే చికిత్స తీసుకోకుంటే మాత్రం ప్రాణాలకే ముప్పని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఈ వైరస్ సోకిన 8 మందిలో ముగ్గురు చనిపోవడానికి వారు వెంటనే అప్రమత్తం కాకపోవడమేనన్నారు. అయితే ఈ హంటా వైరస్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) కీలక ప్రకటన చేసింది. హంటా వైరస్ వ్యాప్తిపై ఆందోళన వద్దని పేర్కొంది. దీని వల్ల కలిగే ముప్పు చాలా తక్కువని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది.

Cancer :క్యాన్సర్ వంశపారంపర్యమా? తల్లిదండ్రులకు క్యాన్సర్ సోకితే పిల్లలకు వస్తుందా?

Related Articles

Back to top button