HealthJust LifestyleLatest News

Black Salt : బ్లాక్ సాల్ట్ పోషకాల నిధి…ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో

Black Salt : సాధారణంగా మన ఇళ్లల్లో తెల్ల ఉప్పు వాడుతుంటారు. కానీ నల్ల ఉప్పు ఉపయోగాల గురించి తెలిస్తే ఇకపై అదే వినియోగిస్తారు

Black Salt

సాధారణంగా మన ఇళ్లల్లో తెల్ల ఉప్పు వాడుతుంటారు. కానీ నల్ల ఉప్పు(Black Salt) ఉపయోగాల గురించి తెలిస్తే ఇకపై అదే వినియోగిస్తారు. బ్లాక్ సాల్ట్(Black Salt) ను పలు ఆహారపదార్థాలు, ,పానీయాలలో వాడతారు. ఇది కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అంతే కాదు బ్లాక్ సాల్ట్ ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ ఇస్తుంది.

ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది. ఈ బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ వంటి వాటి రుచిని పెంచుతుంది. ముఖ్యంగా వెజ్ వంటకాలకు నాన్ వెజ్ రుచిని ఇచ్చే వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. అలాగే దీని వల్ల చాలా ఉపయోగాలు ఉండడంతో పోషకాల నిధిగా చెబుతుంటారు. కాలా నమక్ గా పిలిచే దీనిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి.

దీనిలో సాధారణ ఉప్పుకంటే తక్కువ సోడియం ఉంటుంది.సోడియం తక్కువగా ఉండే ఈ ఉప్పుని తీసుకోవడం వల్ల హైబీపి తగ్గుతుంది. అలాగే నల్ల ఉప్పు ఎసిడిటీ నుంచి రిలీఫ్ ఇస్తుంది.తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలను నిరోధించడంలో నల్ల ఉప్పు బాగా ఉపయోగపడుతుంది.

Black Salt
Black Salt

బ్లాక్ సాల్ట్ కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. జంక్ ఫుడ్ వంటి వాటిని ఎక్కువగా తింటూ అజీర్తి, ఇతర సమస్యలతో బాధపడే వారికి చిటికెడు నల్ల ఉప్పు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పిని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కట్టడి చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గే విషయంలో బ్లాక్ సాల్ట్ చాలా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చాలా మంది సలాడ్, పానీయం వంటి వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే, అది బరువును తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

చర్మం, జుట్టు సమస్యలని కూడా దూరం చేసే మినరల్ కంటెంట్ ఈ నల్ల ఉప్పులో ఉంది. అయితే ఈ బ్లాక్ సాల్ట్ ను కూడా అధికంగా తీసుకుంటే కొన్ని చెడు ఫలితాలున్నాయి. రోజుకు 6 గ్రాముల కంటే తక్కువ తీసుకుంటేనే మంచిది.

Rose Plants:గులాబీ మొక్కలు పెంచుతున్నారా.. ఏడాదంతా పూలు పూయాలంటే ఇలా చేయండి..

Related Articles

Back to top button