HealthJust LifestyleLatest News

Monjaro :బరువు తగ్గేందుకు కొత్త దారి.. ఈ మోంజారో ఇంజెక్షన్లు ఎంత వరకూ మంచివి?

Monjaro : మంచి ఆహారం తీసుకోవడం, వాకింగ్ , ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా బరువు తగ్గడమే అన్నిటికంటే మంచి మార్గం.

Monjaro

ఈ మధ్య కాలంలో వెయిట్ తగ్గడం కోసం.. చాలా మంది ఒక కొత్త రకమైన మోంజారో (Monjaro) ఇంజెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఇది టైప్-2 డయాబెటిస్ ఉన్నవారి కోసం డాక్టర్లు రాసే ఒక ఇంజెక్షన్. కానీ ఇప్పుడు చాలా మంది దీనిని బరువు తగ్గడానికి ఒక షార్ట్‌కట్ లాగా వాడుతున్నారు.

ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల రక్తంలో డయాబెటిస్ తగ్గడమే కాకుండా, మెదడుకు ఆకలి వేయడం లేదనే సిగ్నల్ పంపిస్తుంది. దీని వల్ల మనం తక్కువ ఆహారం తింటాం, తిన్నది కూడా కడుపులో చాలా సేపు ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఫుడ్ మీద ధ్యాస తగ్గి చాలా వేగంగా బరువు తగ్గుతారు. ముంబయికి చెందిన ఒక యువతి తాను 6 నెలల్లోనే 20 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గానని చెప్పడంతో అందరూ మోంజారో కోసం వెతకడం మొదలుపెట్టారు.

అయితే మోంజారో (Monjaro )వల్ల బరువు తగ్గడం ఎంత వేగంగా జరుగుతుందో.. దీని వల్ల వచ్చే కష్టాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు. ఈ ఇంజెక్షన్ తీసుకున్న వారిలో వికారం, వాంతులు అవ్వడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం,రోజంతా నీరసంగా ఉండటం వంటి సమస్యలు వస్తున్నాయని కంప్లైంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Monjaro
Monjaro

అంతేకాకుండా ఒక్కో ఇంజెక్షన్ కోసం సుమారు 4 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసలు డబ్బు విషయం పక్కన పెడితే, డాక్టర్ సలహా లేకుండానే కేవలం బరువు తగ్గాలి కదా అని మనకు మనమే ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలని అనుకోవడం చాలా ప్రమాదం. మన బాడీపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎవరికీ తెలీదు. పెళ్లైన కొత్తలోనో, వేడుకల కోసమో సన్నబడాలని ఇలాంటి ఇంజెక్షన్ల మీద ఆధారపడటం అస్సలు మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మంచి ఆహారం తీసుకోవడం, వాకింగ్ , ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా బరువు తగ్గడమే అన్నిటికంటే మంచి మార్గం అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ వాడి సన్నబడిన వారు కూడా, అది ఆపేసిన తర్వాత మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం షుగర్ పేషెంట్ల కోసం తయారు చేసిన ఇంజెక్షన్ అని గుర్తుంచుకోవాలని అంటున్నారు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button