Watermelon : పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్ లో పెడుతున్నారా ?..ఆలస్యంగా తింటే విషమే
Watermelon : పుచ్చకాయను ముక్కలుగా కోసి చాలా సేపు పక్కన పెడుతున్నారా? కట్ చేసిన పుచ్చకాయ ఎంత సేపటి వరకు తినడానికి సురక్షితమో మరియు దానిని తాజాగా ఉంచే పద్ధతుల గురించి తెలుసుకోండి.
Watermelon
సమ్మర్ సీజన్ వచ్చిందంటే వేడి నుంచి ఉపశమనం కోసం అందరూ ఇష్టంగా తినేది పుచ్చకాయనే. దాదాపు రెండు నెలల పాటు పుచ్చకాయ సీజన్ బిజీబిజీగా ఉంటుంది. పుచ్చకాయతో దాహం తీరడంతో పాటు త్వరగా జీర్ణమవుతుంది. అయితే మార్కెట్ నుంచి పుచ్చకాయను తీసుకొచ్చిన తర్వాత కట్ చేసినా చాలా మంది పూర్తిగా తినరు.
సగం కట్ చేసి మిగిలినది తర్వాత తింటారు. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కట్ చేసిన తర్వాత ఎక్కువ సేపు బయట ఉంచితే అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పుచ్చకాయ త్వరగా పాడయ్యే స్వభావాన్ని కలిగి ఉండడమే దీనికి కారణం. కట్ చేసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా చాలా త్వరగా వృద్ధి చెందుతుంది. అందుకే దీనిని నిల్వ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కట్ చేసిన పుచ్చకాయను గది ఉష్ణోగ్రతలో రెండు గంటల మించి ఉంచొద్దు. ఎక్కువ సమయం ఉంచితే త్వరగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒకవేళ పుచ్చకాయను ముక్కలుగా కోసి నిల్వ చేయాలనుకుంటే, మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి.

ఇలా చేయడం వల్ల 24 గంటల వరకు తాజాగా ఉంటాయి. పుచ్చకాయ ముక్కల రంగు మారినా లేదా జిగటగా అనిపించినా, అసాధారణమైన వాసన వస్తున్నా వాటిని అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే ముక్కలు., కోసి ఉంచిన పుచ్చకాయను తీసుకోవద్దు.
గాలిలోని దుమ్ము,క్రిములు చేరి జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు.పుచ్చకాయను కోసే ముందు నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల పంట పండించేటప్పుడు ఉపయోగించే ఎరువులు, ఇతర రసాయనాలు తొలగిపోతాయి.





