HealthLatest News

Mangoes : కెమికల్స్‌తో మాగబెట్టిన మామిడి పండ్లు…గుర్తించే చిన్న చిట్కాలు ఇవే

Mangoes : వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల ప్రియులకు పండగే.బంగినపల్లి, పెద్ద రసాలు, సువర్ణ రేఖ, కేసర్ వంటి రకాలు సందడి చేస్తాయి

Mangoes

వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి(Mangoes) పండ్ల ప్రియులకు పండగే.బంగినపల్లి, పెద్ద రసాలు, సువర్ణ రేఖ, కేసర్ వంటి రకాలు సందడి చేస్తాయి. కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా మామిడి(Mangoes) పండ్లు చాలా మంచివి. అయితే వీటికి ఉన్న క్రేజ్ దృష్ట్యా మార్కెట్ లో రసాయనాలతో పండించి విక్రయిస్తున్నారు.

ఈ హానికరమైన రసాయనాలు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. కెమికల్స్ సాయంతో మగ్గబెట్టిన మామిడి పండ్లు తింటే ప్రమాదకరమైన రోగాలను కొని తెచ్చుకున్నట్టే. ఈ నేపథ్యంలో కెమికల్స్ తో పండించిన మామిడి పండ్లను చిన్న చిట్కాలతో గుర్తించవచ్చు.సహజంగా పండిన మామిడి పండ్లు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఆ సువాసన ఎక్కువ దూరం కూడా వస్తుంది. అయితే కార్బైడ్‌తో మగ్గబెట్టిన మామిడి పండ్లలో ఈ వాసన రాదు.

అలాగే రసాయనాలను ఉపయోగించి పండించిన మామిడి పండ్లు తేలికగా ఉండి నీటిలో తేలుతాయి. సహజంగా పండిన మామిడి పండ్లు మునిగిపోతాయి.ఇక సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు, లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో ఉండి లోపల మొత్తం పండి ఉంటుంది. పండును నొక్కి చూస్తే కొద్దిగా మెత్తగా ఉంటుంది.

Mangoes
Mangoes

ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా అంత త్వరగా పాడైపోవు.కెమిక్సల్‌తో మాగబెట్టిన  పండు లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి చూడటానికి మాగినట్లుగా కనిపించినా లోపల సరిగ్గా పండదు.మామడి పండు పైన తొక్క ముడతలు లేకుండా ఉండి కొంచెం గట్టిగా ఉంటుంది.సహజంగా పండిన మామిడి పండు ఒకే రంగులో ఉండదు.

కెమికల్స్‌తో పండించిన మామిడి పండు తిన్నప్పుడు నాలుకపై కొద్దిగా మంట పుట్టడం లేదా గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. కెమికల్స్‌తో పండిన మామిడి పండ్లు తినడం వల్ల వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నోటిలో గొంతులో అల్సర్లు ఏర్పడటం వంటివి కనిపిస్తాయి. సహజ మామిడి అద్భుతమైన రుచిని ఇస్తుంది. అయితే ఔషధం కలిపిన మామిడి పండ్లు వింత రుచిని కూడా కలిగి ఉంటాయి. ఈ చిన్న చిట్కాల ద్వారా నిజమైన మామిడి పండ్లను గుర్తించి తీసుకుంటే ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Relationships : బంధాలను విచ్ఛిన్నం చేస్తున్న కమ్యూనికేషన్ గ్యాప్..మౌనం మీ మధ్య దూరాన్ని పెంచేస్తుందట

Related Articles

Back to top button