Watermelon:మీరు కొన్న పుచ్చకాయ మంచిదా కాదా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టండి..
Watermelon:పుచ్చ పండు నేలకు తగిలి ఉండే చోట క్రీమ్ కలర్ కానీ, లేత ఆరెంజ్ రంగులో కానీ మచ్చ ఉండాలి. ఆ మచ్చ తెల్లగా ఉంటే అది సరిగ్గా పండలేదని అర్థం.
Watermelon
వేసవి కాలం వచ్చిందంటే చాలామంది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం కోసం కొబ్బరినీళ్లు, పుచ్చకాయ,కర్బూజాపండు వంటివి తీసుకుంటారు. వీటిలో ముఖ్యంగా పుచ్చకాయను(Watermelon) తినడానికి చాలామంది ఇష్టపడతారు.
అయితే ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే పుచ్చకాయలు ఎంతవరకు సురక్షితమైనవనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. పుచ్చకాయ ఎర్రగా, తీపిగా కనిపించడానికి పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉపయోగిస్తున్నారన్న వార్తలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.
కాబట్టి పుచ్చకాయ కొనే ముందు ఏది కల్తీ ఏది సహజమైన పుచ్చకాయ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పుచ్చకాయ ఎర్రగా కనిపించడానికి తరచుగా ఎరిత్రోసిన్ లేదా రెడ్-బి అనే రసాయన రంగులను వాడుతుంటారు.
పుచ్చకాయలో కల్తీని గుర్తించడానికి ఒక చిన్న పరీక్ష చేయొచ్చు. పుచ్చకాయను రెండు ముక్కలుగా కోసిన తర్వాత, ఒక తెల్లటి దూది ముక్కను తీసుకుని ఎర్రగా ఉన్న గుజ్జుపై మెల్లగా రుద్దాలి. దూది తెల్లగానే ఉంటే అది సహజమైన పండు అని అర్ధం. ఒకవేళ దూది ఎర్రగా మారితే, దానికి కృత్రిమ రంగులు అద్దారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కల్తీ పండ్లను తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు , తీవ్రమైన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

మంచి పుచ్చకాయను ఎంచుకోవడానికి మరికొన్ని చిట్కాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయ దాని పరిమాణం కంటే తక్కువ బరువుగా ఉండాలి. అప్పుడే అది జ్యూసీగా ఉన్నట్లు అని తెలుసుకోవాలి . పండుపై వేళ్లతో తట్టినప్పుడు డబ్ డబ్ అనే లోతైన శబ్దం రావాలి.
అలాగే పుచ్చ పండు నేలకు తగిలి ఉండే చోట క్రీమ్ కలర్ కానీ, లేత ఆరెంజ్ రంగులో కానీ మచ్చ ఉండాలి. ఆ మచ్చ తెల్లగా ఉంటే అది సరిగ్గా పండలేదని అర్థం. సమానంగా, ఎగుడుదిగుడులు లేకుండా ఉన్న పుచ్చకాయను ఎంచుకోవడం వల్ల మీరు ఆరోగ్యకరమైన , తీపి పుచ్చకాయను ఇంటికి తీసుకుని వెళ్లగలరు.
Children:తల్లిదండ్రులు,బంధువుల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది? వారి ఫ్యూచర్‌ను డిసైడ్ చేసేది ఎవరు?





