JackFruit Flour : షుగర్ పేషెంట్లకు అద్భుతమైన మెడిసిన్..పనస పిండిని ఎలా తీసుకోవాలో తెలుసా ?
JackFruit Flour : షుగర్ ను కంట్రోల్ చేసేందుకు మన ప్రకృతిలో దొరికే పనస పండు అద్భుతంగా ఉపయోగపడుతుంది
JackFruit Flour
మారుతున్న ఆహారపు అలవాట్లతో డయాబెటిస్ పేషెంట్లు కూడా పెరిగిపోతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఔషధ గుణాలున్న ఆహారాలను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో షుగర్ తో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే షుగర్ ను కంట్రోల్ చేసేందుకు మన ప్రకృతిలో దొరికే పనస పండు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు.
పనస కాయలను కూరగానో, పండుగానో తినడం అందరికీ అలవాటు. కానీ షుగర్, కొలెస్ట్రాల్‌తో బాధపడే వారు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ప్రకృతి సిద్ధమైన పరిష్కారంగా మారింది. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపు చేయడమే కాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుత గుణాలు పనస పండులో ఉన్నాయి. పలు శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు పనస పండును శక్తివంతమైన సూపర్ ఫుడ్ గా చెబుతున్నాయి.
ముఖ్యంగా షుగర్‌ని నియంత్రించడంలో ఈ పనస పిండి(JackFruit Flour) బాగా ఉపయోపడుతుందని తేలింది. బియ్యం, గోధుమలు వంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారానికి ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. ఈ పనస పిండి(JackFruit Flour) రక్తంలోని షుగర్ లెవల్స్‌ని స్థిరంగా ఉంచడంతో పాటు శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాన్ని అందిస్తుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండిన ఈ పనస పిండిని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పనస పిండి గ్లైసెమిక్ ఇండెక్స్‌ని తగ్గిస్తుంది. వరి లేదా గోధుమ పిండితో పోలిస్తే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి భోజనంలో లేదా అల్పాహారంలో ఒక స్పూన్ పనసపిండి కలుపుకుని తింటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి.

పనస పిండిలో పీచు పదార్థం అధికంగా ఉండడంతో తిన్న తర్వాత కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది అత్యుత్తమైన ఆహారంగా చెబుతున్నారు. శరీరంలో అనవసరంగా కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా అడ్డుకోవడంలో పనస పిండి కీలకపాత్ర పోషిస్తుంది.
అంతే కాదు దీని వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇది ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక పనస పిండిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం శరీరంలోని సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తనాళాల గోడలను రిలాక్స్ చేస్తుంది. దీని వల్ల బీపీ అదుపులోకి వచ్చి గుండెపై పడే ఒత్తిడి తగ్గుతుంది.
Self Talk : ఆత్మవిమర్శ అనే అడ్డంకి మిమ్మల్నీ అడ్డుకుంటుందా?..నెగటివ్ సెల్ఫ్ టాక్ ఎందుకు?





