BJP : కాషాయ పార్టీ భారీ స్కెచ్..ప్రాంతీయ పార్టీల ఫ్యూచర్ ఏంటి?
BJP : ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ ముందుకు సాగుతోంది.
BJP
మన దేశంలో ప్రాంతీయ పార్టీలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్థానిక సమస్యలకు, సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచే ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను, ప్రభుత్వాల ఏర్పాటును ప్రభావితం చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.జాతీయ పార్టీలు దేశవ్యాప్త విధానాలపై దృష్టి పెడితే ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల, ప్రాంతాల నిర్దిష్ట సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాయి.
అయితే ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ(BJP) పావులు కదుపుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇది వర్కౌట్ అయింది కూడా. చాలా సందర్భాల్లో రాష్ట్రాలను శాసించిన ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ఓడిపోగానే పట్టు కోల్పోతున్నాయి.ఆయా పార్టీల నాయకులు, కీలక నేతలు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతీయ పార్టీలోకి జంప్ చేస్తున్నారు.
సహజంగానే అధికారంలో ఉండే పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని తగ్గించి, వాటికి చెక్ పెట్టేందుకు ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతోంది.దీంతో బీజేపీ(BJP) కొన్ని సార్లు తమ ఆపరేషన్ ఆకర్ష్ ను ఉపయోగిస్తుంది. కీలక నాయకులను, ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా ఆయా ప్రభుత్వాలను పడగొడుతూ, పార్టీలను చీల్చడం బీజేపీ అనుసరిస్తున్న ప్రధాన వ్యూహంగా చెప్పొచ్చు.
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలను చీల్చి, ఆ పార్టీలలోని ప్రధాన వర్గాలను తమ కూటమిలోకి చేర్చుకుంది. ఈ క్రమంలో దేశంలో ప్రాంతీయ పార్టీలు ఇక మనుగడ సాగించడం కష్టమేనా అన్న చర్చ మొదలయింది. కానీ భిన్న సంస్కృతులు, విభిన్న జీవన విధానాలు ఉన్న భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు అంతరించిపోవడం అనేది అసాధ్యమనే చెప్పాలి.
ఇప్పటి వరకు బెంగాల్‌లో 30 సంవత్సరాలు రాజకీయం చేసిన తృణమూల్ పార్టీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌లో 15 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత పట్ల సహజంగానే వ్యతిరేకత వస్తుంది. ఇటు తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు.
తమిళనాడులోనూ అదే రిపీట్ అయింది. అంతే తప్ప ఓడిపోయిన ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అయిపోతాయని అనుకోవడం భ్రమే అవుతుంది.ఎప్పటికప్పుడు ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తూనే ఉండగా మరికొన్ని కొత్త ప్రాంతీయ పార్టీలు పుడుతూనే ఉన్నాయి. 1967 నాటికే దేశంలో 11 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.

59 సంవత్సరాల్లో తమిళనాడులో ఈ రోజుకి బీజేపీ(BJP) గానీ, కాంగ్రెస్ గానీ అధికారంలోకి రాలేకపోయాయి. దేశమంతా వ్యాపించినా ఇప్పటికీ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయింది. 1990 నుండి ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కూటమి ప్రభుత్వాలు. నడుస్తున్నాయి. దీనిని బట్టి ఇండియాలో ప్రాంతీయ పార్టీలను నిర్మూలించడం సాధ్యం కాదని తేలిపోయింది.
Sleep : వీకెండ్‌లో ఎక్కువ నిద్రపోవడం నిజంగా హెల్దీనా? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న నిజాలు..





