Punugulu : సాయంత్రం వేళ వేడివేడి పునుగులు..వానాకాలంలో పర్ఫెక్ట్ స్నాక్స్
Punugulu : పుల్లని మజ్జిగ లేదా పెరుగు, మైదా పిండి కాంబినేషన్లో.. నోరూరించే రోడ్‌సైడ్ బండి స్టైల్లో చల్లని పునుగులను ఇంట్లోనే చాలా ఈజీగా, హైజీనిక్‌గా తయారు చేసుకోవచ్చు.
Punugulu
సాయంత్రం సమయంలో కాస్త చల్లగాలి వీస్తున్నప్పుడో, వర్షం పడుతున్నప్పుడో వేడివేడిగా కరకరలాడే చల్ల పునుగులు తినాలనిపిస్తే.. ఇకపై బయట బండి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పుల్లని మజ్జిగ లేదా పెరుగు, మైదా పిండి కాంబినేషన్లో.. నోరూరించే రోడ్‌సైడ్ బండి స్టైల్లో చల్లని పునుగులను ఇంట్లోనే చాలా ఈజీగా, హైజీనిక్‌గా తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల ఎంతో స్మూత్‌గా ఉండే ఈ పునుగుల స్పెషల్ టేస్ట్ వర్షాకాలంలో తింటే ఇంకా భలేగా ఉంటుంది
ఈ కమ్మని మజ్జిగ పునుగుల తయారీకి కావలసిన పదార్థాలు ఒకసారి చూస్తే.. సుమారు ఒకటిన్నర కప్పుల మైదా పిండి, ముప్పావు కప్పు పుల్లటి పెరుగు కానీ చిక్కటి మజ్జిగ కానీ తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఆప్షనల్‌గా ఒక సన్నటి ఉల్లిపాయ తరుగు, ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు, పిండి కలపడానికి తగినన్ని నీళ్లు , డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోవాలి.
ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో మైదా పిండి, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మజ్జిగ కూడా వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. ఆ తర్వాత పిండిని చేతితోనే బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిపై మూత పెట్టి 30 నిమిషాలు అయినా పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా పులిసి.. పునుగులు లోపల స్పాంజీలా మెత్తగా తయారవుతాయి.

ఇక పునుగులు ఫ్రై చేసే ముందు పిండిలో కొంచెం వంట సోడా వేసి మెల్లగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. చేతిని కాస్త నీళ్లతో తడిపి, చిన్న చిన్న ఉండలుగా పిండిని తీసుకుంటూ నూనెలోకి పునుగులుగా చేసి వేయించాలి. వీటిని బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించాలి.
బాగా వేగిన పునుగులను(Punugulu) టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఈ కొలతలతో చేస్తే దాదాపు 25 నుంచి 30 పునుగుల(Punugulu) వరకు ఈజీగా వస్తాయి. వీటిని పల్చటి అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో కలిపి తింటే.. రోడ్‌సైడ్ బండి మీద దొరికే ఒరిజినల్ టేస్ట్‌ను ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.
2000 Rupee Notes : ఇంకా 6 వేల కోట్ల రూపాయల 2000 నోట్లు జనాల దగ్గరే.. మార్చుకోవడానికి ఇంకా టైమ్ ఉందా?





