Plastic:నిద్రకు, ప్లాస్టిక్‌కు సంబంధం ఏంటి? మీ వాటర్ బాటిల్ ఆరోగ్యానికి శత్రువుగా మారుతోందా?
Plastic : మనం రోజూ వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేస్తున్నాయో వివరిస్తూ, రీసెంటుగా వెలువడిన సంచలన పరిశోధన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
Plastic
ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందని మనందరికీ బాగా తెలుసు. అయితే అది మన కంటి నిద్రను కూడా దోచేస్తుందని పరిశోధకులు తాజాగా హెచ్చరిస్తున్నారు. మనం రోజూ వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేస్తున్నాయో వివరిస్తూ, రీసెంటుగా వెలువడిన సంచలన పరిశోధన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
చాలా మంది రాత్రి నిద్ర పట్టడం లేదని చెబుతూ ఉంటారు. దీనికి కేవలం మానసిక ఆందోళన, మొబైల్ ఫోన్ వాడకం, కొన్ని రకాల వ్యాధులు కారణమని అనుకుంటారు. కానీ, మనం మంచినీళ్లు తాగడానికి వాడే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మన నిద్రను పాడు చేస్తున్నాయని రీసెంట్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైన రిపోర్ట్ ప్రకారం.. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాలు మనిషి శరీరంలోకి చేరి, అవి రాత్రిపూట కాఫీ తాగినప్పుడు కలిగే కెఫిన్ ప్రభావం కంటే ఎక్కువగా ప్రభావితమయి.. నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి.
నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన అధ్యయన కర్తలు జరిపిన పరిశోధనలో ప్లాస్టిక్ ఉత్పత్తుల నుంచి వెలువడే కెమికల్స్.. మనిషి శరీరంలోని కణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు.
ముఖ్యంగా పీవీసీ (PVC) , పాలీయురేథేన్ వంటి ప్లాస్టిక్ వస్తువుల నుంచి రిలీజయ్యే విషపూరిత అణువులు మనిషి బాడీలోని సహజమైన జీవగడియారాన్ని (Molecular Clock) దెబ్బతీస్తున్నట్లు వివరిస్తున్నారు. దీనివల్ల మనిషి నిద్రపోయే సమయం సగటున పదిహేడు నిమిషాల వరకు లేట్ అవుతుందట. చూడటానికి చిన్న నంబర్‌లా ఉన్నా కూడా ఈ చిన్న మార్పు మనిషిలోని మొత్తం జీవక్రియను అస్తవ్యస్తం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ (Plastic)బాటిళ్లలోని నీరు తాగడం వల్ల కలిగే ఈ దుష్ప్రభావం కేవలం నిద్రలేమికి మాత్రమే పరిమితం కాదు. దీర్ఘకాలంలో ఇది ఒబెసిటీ, రోగనిరోధక శక్తి తగ్గడం, డయాబెటిస్ , క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా యువతలో పెరుగుతున్న నిద్రలేమి సమస్యలకు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం ఒక్కటే మార్గం.
నీటిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ (Plastic) బాటిళ్లకు బదులుగా గాజు సీసాలు, రాగి లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను ఉపయోగించడం ఉత్తమం. చిన్నపాటి మార్పులే మనల్ని భవిష్యత్తులో వచ్చే పెద్ద అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. కాబట్టి, ఇకనైనా ఆ ప్లాస్టిక్ ముసుగును తొలగించి, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయండి.
Cool Drinks :కూల్ డ్రింక్స్ , చిప్స్ కాంబినేషన్ ఇష్టమా? సమ్మర్‌లో ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..





