Rose Water : అందం కోసం రోజ్ వాటర్…మీ చర్మాన్ని మీరే పాడుచేసుకోకండి
Rose Water : ముఖం తాజాగా కనిపించేందుకు చాలా మంది వాడేది గులాబీ రేకుల నుంచి చీసిన రోజ్ వాటర్... ఈ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుంటే చర్మం మరింత మెరిసిపోతుందని నమ్ముతుంటారు
Rose Water
ముఖం తాజాగా కనిపించేందుకు చాలా మంది వాడేది గులాబీ రేకుల నుంచి తీసిన రోజ్ వాటర్… ఈ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుంటే చర్మం మరింత మెరిసిపోతుందని నమ్ముతుంటారు. అయితే రోజ్ వాటర్(Rose Water) తో మీ చర్మాన్ని మీరే పాడుచేసుకుంటున్నారని వైద్య నిపుణులు అంటున్నారు.
అందం కోసం అందరూ ఆశ్రయించే ఈ గులాబీ వాటర్ స్వచ్ఛమైనది కాదంటున్నారు. కేవలం పర్ఫ్యూమ్, ఆల్కహాల్, ఇతర కెమికల్స్ మిశ్రమంగా చెబుతున్నారు. ప్రస్తుతం చాలా బ్యూటీ పార్లర్స్ లోనూ, సెలూన్లలోనూ రెగ్యులర్ గా వాడుతున్న రోజ్ వాటర్(Rose Water) బాటిల్స్ లో గులాబీ రేకుల స్వచ్ఛదనం కంటే కెమికల్సే ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.
ఈ కెమికల్స్ తో చర్మం కొత్త కాంతి రావడం కాదు కదా కొత్త సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. ఈ రసాయనాలు స్కిన్ బారియర్ ను నాశనం చేసే అవకాశముంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ పరిశోధన ప్రకారం సువాసన కలిగిన రోజ్ వాటర్ ఉత్పత్తుల్లో ప్రిజర్వేటివ్‌లు లేదా ఆల్కహాల్ ఉంటాయి.
వీటిని పదేపదే వాడినప్పుడు చర్మంపై ఉండే సహజమైన రక్షణ పొరను డామేజ్ చేస్తాయి. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ద్వారా మరికొన్ని కీలక విషయాలు తెలిసాయి. మొక్కల నుంచి తీసిన సౌందర్య సాధనాల పదార్థాలు కొన్నిసార్లు చర్మం సున్నితత్వాన్ని దెబ్బతీస్తాయి.
అలాగే అలెర్జీలకు కారణమవుతుంది. అంటే పూర్తిగా రోజ్ వాటర్ వాడొద్దని వైద్యనిపుణులు చెప్పడం లేదు. రోజ్ వాటర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు. మేకప్ వేసుకునే మహిళలు క్లెన్సర్‌గా, మేకప్ వేసే ముందు టోనర్‌గా లేదా చర్మం తాజాగా ఉండాలని హైడ్రేటింగ్ మిస్ట్ తరహాలో దీనిని వాడుతుంటారు.

అయితే రోజూ వాడే రోజ్ వాటర్‌లో అసలు గులాబీ అంశాలే లేవన్నది పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. వ్యాపార ప్రకటనల్లో చూపించినట్టు రోజ్ వాటర్ తయారీకి గులాబీ రేకులు వాడరు.అందుకే మనం కొనే రోజ్ వాటర్ బాటిల్స్ వెనుక ఉన్న ఇంగ్రిడియంట్స్ జాబితాను ఖచ్చితంగా పరిశీలించాలి.
అందులో రోజ్ ఎక్స్ట్రాక్ట్ బదులు కేవలం నీరు, ఆల్కహాల్, కృత్రిమ వాసన కోసం పర్ఫ్యూమ్ మాత్రమే ఉంటాయి. మార్కెట్ లో ఇప్పుడు దొరికే రోజ్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇదే తరహాలో తయారు చేస్తున్నారు. అందుకే కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
RCB vs SRH : ఆరంభ పోరులో అదరగొట్టేదెవరు ?…ఇవాళ ఆర్సీబీతో సన్ రైజర్స్ ఢీ





