HealthLatest News

Sweet Potato : బాడీలోని టాక్సిన్స్ బయటకు పంపే స్వీట్ పొటాటో.. ఇంకా చాలా ఉపయోగాలున్నాయ్..

Sweet Potato : చిలకడదుంపను డైరెక్ట్‌గా తినడం కంటే ఉడకబెట్టి, కొద్దిగా కాల్చుకుని లేదా సూప్ రూపంలో తీసుకుంటే ఒంటికి త్వరగా పడుతుంది.

Sweet Potato

ఈ మధ్యకాలంలో చాలామంది టైమ్‌కి తినకపోవడం, తిన్నా జంక్ ఫుడ్ తినడం వంటివి అలవాటు చేసుకుంటున్నారు. ఈ లైఫ్‌స్టైల్ వల్ల ప్రాబ్లమ్ కడుపు ఉబ్బరం బ్లోటింగ్ మరియు తీవ్రమైన గ్యాస్ వంటి సమస్యలను అనేకమంది ఫేస్ చేస్తున్నారు.

దీనిని పోగొట్టుకోవడానికి ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా, ఎన్ని సిరప్‌లు తాగినా ఫలితం మాత్రం ఉండదు. కానీ, మార్కెట్లో దొరికే ఒక సింపుల్ దుంప..స్వీట్ పొటాటో(Sweet Potato) దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అని నిపుణులు అంటున్నారు.

సాధారణంగా బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్‌ను తరచూ తినడం వల్ల, లేదా పేగుల్లో మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి..దీని వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం వస్తుంటాయి. ఇలాంటి సమయంలో చిలగడదుంప(Sweet Potato) ఒక పవర్‌ఫుల్ నాచురల్ మెడిసిన్‌లా పనిచేస్తుంది.

స్వీట్ పొటాటోలో యారాపిన్ అనే ఒక స్పెషల్ ప్రొటీన్ అలాగే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడమే కాకుండా మన లివర్ ఆరోగ్యానికి తిరుగులేని సపోర్ట్ ఇస్తుంది.

దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ డైజెషన్ ప్రాసెస్‌ని స్పీడ్ అప్ చేసి, మోషన్ ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. దాంతో కడుపులో ఎప్పటినుంచో ఆగిపోయిన గ్యాస్ బయటకు పోయి కడుపు చాలా తేలికగా అవుతుంది. అంతేకాదు, దీనిలో ఉన్న పొటాషియం శరీరంలో సోడియం లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ వాటర్ రిటెన్షన్‌ను కంట్రోల్ చేస్తుంది.

Sweet Potato
Sweet Potato

చిలకడదుంపను డైరెక్ట్‌గా తినడం కంటే ఉడకబెట్టి, కొద్దిగా కాల్చుకుని లేదా సూప్ రూపంలో తీసుకుంటే ఒంటికి త్వరగా పడుతుంది. అయితే ఐబీఎస్ (IBS- ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), కిడ్నీ ప్రాబ్లెమ్స్ ఉన్నవారు, కార్బ్స్ తగ్గించుకోవాలనుకునేవారు మాత్రం డాక్టర్ సలహాతోనే తినాలి.

అలాగే ఒకవేళ కడుపు ఉబ్బరంతో పాటు కడుపునొప్పి రావడం, హఠాత్తుగా బరువు తగ్గిపోవడం, మోషన్‌లో రక్తం పడటం లాంటి డేంజరస్ సింప్టమ్స్ ఉంటే మాత్రం వారికి స్వీట్ పొటాటో మెడిసిన్ కాదు. వీళ్లు ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

Apple Pay : ఇండియాలోకి యాపిల్ పే ఎంట్రీ..కానీ చిన్న ట్విస్ట్ ఉందట..

Related Articles

Back to top button