HealthLatest News

Milk :వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి..

Milk : వేసవిలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం వల్ల పాలలో బ్యాక్టీరియా వృద్ధి చెంది అవి త్వరగా పాడవుతాయి. కొన్నిసార్లు ఫ్రిజ్‌లో పెట్టినా కూడా పాలు విరిగిపోతుంటాయి.

Milk

ఎండాకాలం వచ్చిందంటే చాలు గృహిణులకు పాలను విరిగిపోకుండా చూసుకోవడం పెద్ద తలనొప్పిగా మారుతుంది . ఉదయం తీసుకున్న పాలు సాయంత్రం లోపే విరిగిపోతూ ఉంటాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం వల్ల పాలలో బ్యాక్టీరియా వృద్ధి చెంది అవి త్వరగా పాడవుతాయి. కొన్నిసార్లు ఫ్రిజ్‌లో పెట్టినా కూడా పాలు విరిగిపోతుంటాయి.

అయితే, మన పెద్దలు అనుసరించిన కొన్ని నేచురల్ పద్ధతులను పాటిస్తే పాలను రెండు మూడు రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. అందులో బేకింగ్ సోడా చిట్కా ప్రధానమైనది.

పాలు(Milk) మరిగించేటపుడు ఒక చిటికెడు బేకింగ్ సోడాను కలిపితే, అది పాలలోని పీహెచ్ (pH) స్థాయిని కంట్రోల్ చేసి బ్యాక్టీరియా చేరకుండా చూస్తుంది. అయితే ఇది ఎక్కువ మోతాదులో కాకుండా కేవలం చిటికెడు మాత్రమే వేయాలి. ఎందుకంటే ఎక్కువ బేకింగ్ సోడా వేస్తే పాల రుచి మారిపోయే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన విషయం .. మనం పాలు కాచే గిన్నె శుభ్రంగా లేకపోయినా కూడా పాలు త్వరగా విరిగిపోతాయి. తోమి పక్కన పెట్టుకున్న గిన్నె అయినా సరే.. పాలు పోయడానికి ముందు ఆ గిన్నెను మరోసారి చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. గిన్నె అడుగున కొద్దిగా నీరు వేసి అవి కాస్త వేడిగా అయ్యాక ఆపై పాలు పోయడం వల్ల పాలు అడుగు అంటవు అలాగే ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.

అలాగే పాలను మరిగించేటప్పుడు వాటిలో ఒకటి లేదా రెండు పచ్చి యాలకులను వేయాలి. ఇలా వేయడం వల్ల పాలకు మంచి సువాసన రావడమే కాకుండా అవి సహజ సిద్ధమైన నిల్వకారిణిగా పని చేసి పాలను పాడవకుండా కాపాడతాయి.

Milk
Milk

మరిగించే సమయం కూడా పాలకు చాలా కీలకం. ఎండాకాలంలో పాలను కనీసం ప్రతి 8 గంటలకు ఒకసారి తిరిగి వేడిచేయాలి. పాలు బాగా మరిగిన తర్వాత వాటిని రూమ్ టెంపరేచర్‌కు వచ్చే వరకు బయటే ఉంచాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి.

వేడి పాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఫ్రిజ్‌లోని టెంపరేచర్ పెరగడమే కాకుండా పాలు(Milk) విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మండే ఎండల్లో కూడా పాలను విరిగిపోకుండా నిల్వ చేసుకోవచ్చు.

Fake Friendships : నకిలీ స్నేహాలకు గుడ్ బై చెప్పండి.. గొడవలు లేకుండా దూరం పెట్టాలంటే ఇవి తెలుసుకోండి

Related Articles

Back to top button