Urinary Tract Infection : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళలలోనే ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఏంటి?
Urinary Tract Infection : యూరినరీ ట్రాక్ట్‌లో బ్యాక్టీరియా ఎలా చేరుతుంది? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు, అపోహలు, ట్రీట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Urinary Tract Infection
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న మెయిన్ హెల్త్ ప్రాబ్లెమ్స్లో ఒకటిగా మారిపోయింది. ముఖ్యంగా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కలిగే అసౌకర్యం, మంట, దురద డైలీ పనులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అసలు యూరినరీ ట్రాక్ట్‌లో బ్యాక్టీరియా ఎలా చేరుతుంది, దీని లక్షణాలు, అపోహలు, ట్రీట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మూత్ర విసర్జన వ్యవస్థలో కిడ్నీలు, మూత్రనాళాలు (Ureters), మూత్రాశయం (Bladder), మరియు మూత్రద్వారం (Urinary tract) ఉంటాయి. సాధారణంగా మూత్రం అనేది క్రిములు లేనిది (స్టెరైల్). కానీ బయటి నుంచి బ్యాక్టీరియా మూత్రద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి మూత్రాశయంలోకి లేదంటే కిడ్నీల వైపు వ్యాపించినప్పుడు మాత్రం ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీనినే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(Urinary Tract Infection) అంటారు. ఈ ఇన్ఫెక్షన్కు ప్రధానంగా ఈ-కోలై (E. coli) అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఇది సాధారణంగా మన జీర్ణవ్యవస్థ లేదా పేగుల్లో ఉంటుంది.
మూత్రనాళ ఇన్ఫెక్షన్ రావడానికి అనేక రకాల లైఫ్ స్టైల్ , శారీరక కారణాలు ఉంటాయి. తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల యూరిన్ ఉత్పత్తి తగ్గి, మూత్రనాళంలో ఉన్న బ్యాక్టీరియా బయటకు వెళ్లకుండా లోలోపలే పెరిగిపోతుంది. నీట్నెస్ లోపించడం, మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వంటి అలవాట్లు కూడా బ్యాక్టీరియా పెరగడానికి దోహదం చేస్తాయి. మగవారితో పోలిస్తే మహిళల్లో మూత్రద్వారం పరిమాణం చాలా చిన్నదిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా మూత్రాశయాన్ని చేరుకుంటుంది. లైంగిక చర్యల తర్వాత కానీ డయాబెటిస్ ఉన్నవారిలో కానీ రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపిస్తుంది.
ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి బాడీలో స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. యూరిన్ పాస్ చేసే సమయంలో తీవ్రమైన మంట, నొప్పి రావడం, పదే పదే టాయిలెట్‌కు వెళ్లాలనిపించడం కానీ వెళ్లినప్పుడు కొద్దిగానే రావడం కానీ మెయిన్ లక్షణాలు. మూత్రం ముదురు రంగులో రావాడం అలాగే దుర్వాసనతో రావడం, పొట్ట క్రింది భాగంలో నడుము లేదా పొత్తికడుపులో నొప్పి రావడం కూడా జరుగుతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే చలితో కూడిన జ్వరం , వాంతులు కూడా రావొచ్చు.
టైమ్‌కు ట్రీట్మెంట్ తీసుకోకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(Urinary Tract Infection) వల్ల చాలా ఎక్కువ హెల్త్ ప్రాబ్లెమ్స్ తలెత్తుతాయి. మూత్రాశయానికే పరిమితమైన ఇన్ఫెక్షన్ క్రమంగా కిడ్నీలకు కూడా వ్యాపించి పైలోనెఫ్రెటిస్ అనే డేంజరస్ సిచ్యువేషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల కిడ్నీలను శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్ వస్తే నెలలు నిండకుండానే ప్రసవం అవ్వడం లేదంటే తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి పాకితే సెప్సిస్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీసే ఛాన్స్ ఉంది.
సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వారు వీరు చెప్పారని ఏవో మెడిసిన్స్ వాడకుండా తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ల సలహాతో యాంటీబయోటిక్స్ కోర్సును పూర్తిగా వాడటం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.
దీంతో పాటు రోజుకు కనీసం 3 – 4 లీటర్ల మంచినీళ్లు తాగడం ద్వారా మూత్రం ఎక్కువగా వచ్చి బ్యాక్టీరియా బయటకు కొట్టుకుపోతుంది. క్రానబెర్రీ జ్యూస్ (Cranberry juice) రెగ్యులర్‌గా తాగడం వల్ల బ్యాక్టీరియా మూత్రాశయ గోడలకు అంటుకోకుండా అడ్డుకోవచ్చు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీలోని వేడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది. అలాగే ప్రోబయోటిక్స్ ఉన్న పెరుగు వంటివి తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
మూత్రనాళ ఇన్ఫెక్షన్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే వెళ్లాలి. శారీరక పరిశుభ్రత పాటించాలి. కాటన్ లోదుస్తులు వాడాలి. అలాగే కెఫిన్ లేదా స్పైసీ ఫుడ్స్‌ను తగ్గించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.





