Gold – Silver Price : దిగివచ్చిన పసిడి,వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలెలా ఉన్నాయి?
Gold - Silver Price : హైదరాబాద్, విజయవాడతో పాటు ముఖ్యమైన నగరాల్లో గోల్డ్ , సిల్వర్ ధరలు కొద్దిగా తగ్గాయి. నేటి 24 క్యారెట్లు, 22 క్యారెట్ల పసిడి రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Gold – Silver Price
పసిడి, వెండి కొనాలని వెయిట్ చేస్తున్న వారికి కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్‌తో కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న పసిడి ధరలు శనివారం కొద్దిగా తగ్గాయి. పసిడితో పాటు సిల్వర్ ధర కూడా కొంత దిగి రావడంతో ఆభరణాలు కొనాలనుకునే వారు మార్కెట్ ధరలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు సుమారు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, వరంగల్, విజయవాడ , విశాఖపట్నం మార్కెట్లలో నమోదైన ధరల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1లక్ష37వేల340 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1లక్ష25వేల890 గా నమోదైంది.
తెలంగాణలోని ఖమ్మంతో పాటు ఏపీలోని రాజమండ్రి, తిరుపతి నగరాల్లో కూడా పసిడి ధరల్లో పెద్దగా తేడా కనిపించడం లేదు. లోకల్ జ్యువెల్లరీ షాపులు, ప్రాంతీయ పన్నులను బట్టి చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా.. ప్రధాన ప్రాంతాల్లో రేట్లు సుమారు ఒకే విధంగా ఉన్నాయి.
దేశంలోని ఇతర సిటీలతో పోల్చి చూస్తే కొన్ని ప్రాంతాల్లో ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1లక్ష37వేల490 వద్ద కొనసాగుతుండగా, చెన్నైలో ఇదే పరిమాణం ధర రూ. 1లక్ష38వేల480 గా నమోదైంది. సిటీల మధ్య ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు, స్థానిక పన్నులు వంటి అంశాల వల్ల ఈ వ్యత్యాసాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాగా బంగారంతో పాటే వెండి మార్కెట్లో కూడా కొద్దిగా తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ. 1 లక్ష94వేల900 వద్ద ఉంది. ఇండస్ట్రియల్ అవసరాలతో పాటు పెట్టుబడి రూపంలోనూ సిల్వర్‌కు డిమాండ్ ఉండటంతో గ్లోబల్ మార్కెట్ మార్పులు దేశీయ ధరలపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.
అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు(Gold – Silver Price) ప్రతిరోజూ మారుతుంటాయి కనుక కొనుగోలుదారులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇక్కడ కేవలం మార్కెట్ ప్రారంభ ధరలు మాత్రమే. వీటితో పాటు ఆభరణాల తయారీ ఛార్జీలు, జీఎస్టీ ,ఇతర పన్నులు అనేవి షాపులను బట్టి ఎక్స్ట్రాగా చెల్లించాల్సి ఉంటుంది. జ్యువెలరీ డిజైన్‌ను బట్టి తయారీ ఛార్జీలు మారతాయి. కాబట్టి కొనే ముందు లైవ్ రేట్లతో పాటు ఫైనల్ బిల్లింగ్ వివరాలను సరి చూసుకోవడం మంచిది.





