HealthLatest News

Walnuts : గుండె ఆరోగ్యానికి, బ్రెయిన్ పవర్‌కు వాల్‌నట్స్.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

Walnuts : వెయిట్ తగ్గాలనుకునే వారికి వాల్‌నట్స్ ఒక అద్భుతమైన ఎంపిక అనే చెప్పాలి. దీనిలో ప్రోటీన్ , ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదు.

Walnuts

డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు , యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను యాక్టివ్‌గా ఉంచి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను , మొత్తం మెదడు పనితీరును అద్భుతంగా మెరుగుపరుస్తాయి. చదువుకునే పిల్లలకు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో వాల్‌నట్స్(Walnuts) మెయిన్ రోల్ పోషిస్తాయి. వీటిలో ఉండే మంచి హెల్దీ ఫ్యాట్స్ బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ను మెల్లగా తగ్గించి, గుండెను ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతాయి. అలాగే వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి.

వెయిట్ తగ్గాలనుకునే వారికి వాల్‌నట్స్(Walnuts) ఒక అద్భుతమైన ఎంపిక అనే చెప్పాలి. దీనిలో ప్రోటీన్ , ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీనివల్ల ఓవర్ ఈటింగ్ సమస్య తగ్గి ఈజీగా వెయిట్ అదుపులోకి వస్తుంది.

Walnuts
Walnuts

శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి రక్షించడంలో , రోగనిరోధక శక్తిని పెంచడంలో వాల్‌నట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం రోజుకు 4 నుంచి 5 వాల్‌నట్స్ డైరెక్టుగా అయినా లేదంటే 3 వాల్‌నట్స్‌ను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల పూర్తి పోషకాలు బాడీకి అందుతాయి.

అయితే ఈ ఆరోగ్య సమాచారాన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే పరిగణించాలి. మధుమేహం, గుండె జబ్బులున్నవారు వీటిని ట్రీట్మెంట్‌కు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడూ కూడా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Punugulu : సాయంత్రం వేళ వేడివేడి పునుగులు..వానాకాలంలో పర్ఫెక్ట్ స్నాక్స్

Related Articles

Back to top button