Just InternationalJust PoliticalLatest News

America – Iran :యుద్ధానికి ఎండ్ కార్డ్..అమెరికా ,ఇరాన్ బిగ్ డీల్..ఆ 3 గండాల నుంచి గట్టెక్కిన భారత్

America - Iran : అమెరికా , ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న అమెరికా అధ్యక్షుడు.. ఆ దేశంపై తాము విధించిన నావికా దిగ్బంధనం ఇకపై ముగుస్తుందని స్పష్టం చేశారు

America – Iran

ప్రపంచ రాజకీయాల్లో, అంతర్జాతీయ ఆయిల్ సెక్టార్‌లో ఊహించని భారీ పరిణామం చోటు చేసుకుంది. ఎన్నాళ్లుగానో ఉత్కంఠ రేపుతున్న అమెరికా , ఇరాన్(America – Iran) దేశాల మధ్య ఎట్టకేలకు ఒక చారిత్రాత్మకమైన శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా , ఇరాన్ దేశాలు అఫీషియల్‌గా ప్రకటించాయి.

ఈ ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్‌లో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంటుంది. ఈ తాజా పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అమెరికా , ఇరాన్(America – Iran) మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న అమెరికా అధ్యక్షుడు.. ఆ దేశంపై తాము విధించిన నావికా దిగ్బంధనం ఇకపై ముగుస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోని నౌకలన్నీ ఇకపై ఇంజిన్లను స్టార్ట్ చేసి, ఎలాంటి పన్నులు లేకుండా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవచ్చంటూ పిలుపునిచ్చారు.

ఈ శాంతి ఒప్పందం వార్త ప్రపంచ మార్కెట్లకు, ముఖ్యంగా ఆయిల్ సెక్టార్‌కి చాలా పెద్ద ఊరటనిచ్చే విషయంగా మారింది. ఇప్పటివరకు అందరిలో నెలకొన్న ఆందోళన, భయం తగ్గుముఖం పడుతున్నాయని, సముద్ర మార్గం ద్వారా చమురు రవాణాకు మళ్లీ భద్రత కలుగుతోందని దీనివల్ల క్లియర్‌గా అర్థమవుతోంది.

ఈ రెండు దేశాల ఒప్పందం ఒక్క ఇంధన మార్కెట్‌కే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో కీలకమనే చెప్పాలి. ఎందుకంటే హర్మూజ్ జలసంధి అనేది ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక అలాగే ముఖ్యమయిన సముద్ర మార్గాల్లో ఒకటి. పర్షియన్ గల్ఫ్ దేశాల నుంచి బయటకు వెళ్లే ముడి చమురు, ఎల్‌ఎన్‌జీలో చాలా భాగం హర్మూజ్ జలసంధి మార్గం గుండానే ప్రయాణిస్తుంది.

ఒకవేళ ఈ హర్మూజ్ జలసంధి మూసుకుపోతే ఇంధన ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. అందుకే ఈ రూట్ తిరిగి అందుబాటులోకి రావడం వల్ల చమురు సరఫరా గొలుసులో మళ్లీ నమ్మకం పెరుగుతోంది. మార్కెట్లలో కంగారు తగ్గి, షిప్పింగ్ ఖర్చులు అదుపులోకి వస్తాయి. అలాగే రిఫైనరీలకు నిరంతర సరఫరా కొనసాగుతుంది.

నిజానికి ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలన్నిటికి 3 ప్రధాన ప్రమాదాలు తప్పాయనే చెప్పొచ్చు.వీటిలో మొదటిది ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడం అలాగే రెండోది దానివల్ల వచ్చే ద్రవ్యోల్బణ ఒత్తిడి. ఇక మూడోది సముద్ర వాణిజ్య మార్గాల్లో భద్రతా సంక్షోభం.

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అది కేవలం పెట్రోల్ బంక్‌లకే పరిమితం కాదు.. ట్రాన్స్‌పోర్ట్, ఆహార ధరలు, పవర్ ప్రొడక్షన్, ఇండస్ట్రీ ఖర్చులు ఇలా అన్నింటిపైన కూడా దారుణమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే హర్మూజ్ జలసంధిపై నిశ్చింత రావడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు చాలా పెద్ద పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్లే అయింది.

ఈ పరిణామం భారత్‌కు కూడా ఎంతో ఉపయోగం. ఎందుకంటే భారతదేశం తన ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సరఫరాపై భారత దేశం ఎక్కువ ఆధారపడుతుంది. కాబట్టి ఈ రూట్ ఇప్పుడు తిరిగి తెరుచుకోవడం వల్ల సరఫరా నిరంతరంగా సాగుతుంది.

ఈ డీల్ వల్ల భారతదేశానికి మూడు ముఖ్యమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్‌ది ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటం, రెండోది చమురు ధరలు అదుపులో ఉంటే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, మూడోది ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు తగ్గి పరిశ్రమలపై భారం తగ్గడం. దీనివల్ల సాధారణ ప్రజలకు ఊరట లభిస్తుంది.

ఆయిల్ మార్కెట్‌లో ఇలాంటి ప్రకటనలు సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లైన బ్రెంట్, డబ్ల్యూటీఐ వంటి క్రూడ్ ధరలపై ఇది కన్సిస్టెన్నీని తీసుకొస్తుంది. దీని వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అంతేకాదు ఎల్‌పీజీ, విమాన ఇంధనం, లాజిస్టిక్స్ ఖర్చులు కూడా కొంత కంట్రోల్‌లో ఉంటాయి. ఇది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద, హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.

రాజకీయంగా చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు చాలా ప్రాధాన్యత ఉంది. అమెరికా ఇప్పుడు ప్రపంచ సమస్యను కంట్రోల్ చేసిందని, నౌకా మార్గాలన్నీ తిరిగి సురక్షితమయ్యాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రకటనలు అమెరికా దేశీయ రాజకీయాల్లోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఆయన ఇమేజ్‌ను మరింత పెంచుతాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా అగ్రరాజ్యం అమెరికా ఇంకా కీలక శక్తిగా పనిచేస్తోందన్న మెసేజ్ దీని ద్వారా వెళ్తుంది.

America - Iran
America – Iran

ఇరాన్ వైపు నుంచి కూడా ఇదొక వ్యూహాత్మక సర్దుబాటు కావచ్చనే చెప్పొచ్చు. ఎందుకంటే నావికా దిగ్బంధనంలో సడలింపు రెండు దేశాలకు కూడా టెంపరరీ లాభాన్ని ఇస్తుంది. ఈ పరిణామంతో భారత్‌లో రిఫైనరీలు, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ రంగం, ఎఫ్‌ఎమ్‌సీజీ ,వ్యవసాయ సరఫరా గొలుసు రంగాలన్నీ కూడా బాగా లాభపడతాయి. ముఖ్యంగా రవాణా ఖర్చులు తగ్గడం వల్ల ధరల ఒత్తిడి తగ్గుతుంది. సాధారణ వినియోగదారులకు కూడా ఇది గుడ్ న్యూస్ కాబట్టి కుటుంబ బడ్జెట్‌పై భారం తగ్గుతుంది. ద్రవ్యోల్బణం తగ్గితే రిజర్వ్ బ్యాంక్‌కు కూడా కొంత ఊరట లభిస్తుంది.

అయితే ఒక ఒప్పందం కుదిరినంత మాత్రాన అన్ని సమస్యలు పూర్తిగా పోయినట్లే అని అనుకోలేం. ఇంకా కూడా జాగ్రత్త అవసరమే. మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఎప్పుడైనా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుంది. నావికా మార్గాల భద్రత, ఉగ్ర ముప్పు, ప్రాంతీయ శక్తుల మధ్య విభేదాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

ప్రస్తుతానికి అయితే ప్రపంచానికి ఒక పెద్ద గండం తప్పినట్టే చెప్పొచ్చు. మొత్తానికి అమెరికా,ఇరాన్(America – Iran) మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందం, హర్మూజ్ జలసంధి రీ ఓపెన్ కావడం అనేది గ్లోబల్ లెవెల్‌లో ఒక బిగ్ రిలీఫ్ అనే అనొచ్చు.

Psychology : మనల్ని ఇష్టపడని వారిని కూడా దోస్తులుగా మార్చుకోండి.. ఆ 3 సైకలాజికల్ సీక్రెట్స్ ఇవే

Related Articles

Back to top button