Just InternationalJust NationalLatest News

Anti South Asian Hate In US : ఆన్‌‌లైన్ హేట్ అటాక్ ..అమెరికాలో భారతీయులపై 240% పెరిగిన విద్వేషం..

Anti South Asian Hate In US : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి ఇండియన్స్ నీట్‌నెస్ పాటించరని, వారితో జనాభా ముప్పు అని చూపించేలా ఏఐ మీమ్స్, రేసిస్ట్ కార్టూన్లను విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు.

Anti South Asian Hate In US

అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఆన్‌లైన్ వేదికగా ఊహించని నరకం కనిపిస్తోంది. ఉన్నత చదువులు చదువుకుని, H-1B వీసాలు సాధించి అమెరికన్ ఎకానమీని పరుగులు పెట్టిస్తున్న మన ఐటీ ఎక్స్‌పర్ట్స్‌పై మాత్రం ఇంటర్నెట్‌లో జాత్యాహంకార విద్వేషం కట్టలు తెంచుకుంది.

ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా వర్ణ వివక్ష, హేట్ కామెంట్లు బాగా పెరిగిపోతున్నాయని వాషింగ్టన్ డీసీకి చెందిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ (CSOH) ప్రతినిధుల టీమ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ షాకింగ్ రిపోర్ట్ పక్కా ప్రూఫ్స్‌తో నిరూపించింది.

సీఎస్ఓహెచ్‌ (CSOH)రిపోర్ట్ ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంతతికి చెందిన వారిని టార్గెట్ చేసుకుని వస్తున్న విద్వేషపూరిత పోస్టుల నెంబర్ ఏకంగా 240 శాతం పెరిగింది. 2024 జనవరిలో నెలకు సగటున 12వేల904గా ఉన్న హేట్ పోస్టులు, 2026 జూన్‌కి ఏకంగా 43వేల843కి చేరాయి. ఇక 2025 జనవరి నుంచి 2026 జూన్ మధ్య కాలంలో ఏకంగా 5 లక్షలకు పైగా విషపూరిత పోస్టులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడం హాట్ టాపిక్ అయింది.

ఈ స్థాయిలో విద్వేషం పెరగడానికి కొన్ని మెయిన్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అమెరికాలో వివేక్ రామస్వామి, శ్రీరామ్ కృష్ణన్ వంటి భారత సంతతి సెలబ్రెటీలతో పాటు ఎలాన్ మస్క్ కూడా H-1B వీసాలకు సపోర్టుగా మాట్లాడటం, డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో జోరందుకున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) ఉద్యమం, స్ట్రిక్ట్ ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఈ ఆన్‌లైన్ విషప్రచారానికి ఆజ్యం పోస్తున్నాయి.

అమెరికాలోని H-1B వీసాదారుల్లో 70 శాతానికి పైగా ఇండియన్స్ ఉండటంతో.. లోకల్ జాబ్‌లను భారతీయులే లాక్కుంటున్నారనే తప్పుడు అపోహను క్రియేట్ చేస్తూ తీవ్ర ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి ఇండియన్స్ నీట్‌నెస్ పాటించరని, వారితో జనాభా ముప్పు అని చూపించేలా ఏఐ మీమ్స్, రేసిస్ట్ కార్టూన్లను విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు.

ఈ(Anti South Asian Hate In US) వ్యవహారంపై మాట్లాడిన విదేశాంగ శాఖ మాజీ దౌత్యవేత్త రాజీవ్ డోగ్రా.. పొలిటికల్ లీడర్స్ కాంట్రవర్శీ కామెంట్లే జనాలను రెచ్చగొడతాయని, ఐటీ, ఏఐ సెక్టార్లలో ఇండియన్స్ మానసిక ధైర్యం దెబ్బతింటే కనుక.. అది చివరికి అమెరికా ఆర్థిక వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారుతుందని హెచ్చరించారు.

Anti South Asian Hate In US
Anti South Asian Hate In US

ఇక ఇదే విషయంపై స్పందించిన జేఎన్‌యూ (JNU) అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్షు జోషి .. భారత్, అమెరికా బంధానికి ప్రజల నడుమ ఉన్న అనుబంధమే పునాది అని అన్నారు. ఇలాంటి హేట్ పోస్టుల నుంచి భారతీయుల రక్షణను ప్రొటెక్ట్ చేయడం రెండు దేశాల వ్యూహాత్మక పార్ట్‌నర్‌షిప్‌కు అత్యంత ముఖ్యమని చెప్పారు.

సొసైటీలో పెరిగిపోతున్న విద్వేషం, తప్పుడు ఇన్ఫర్మేషన్‌పై నిత్యం రీసెర్చ్ చేసే నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ సంస్థ సీఎస్ఓహెచ్ వెలికితీసిన ఈ రిపోర్ట్ ..ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో పెద్ద చర్చకే తెరలేపింది. తమ మేధస్సుతో ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్ క్రేజీ ఇండియన్స్‌పై ఇలాంటి ఆన్‌లైన్ నెగెటివిటీని(Anti South Asian Hate In US) ఆపకపోతే మాత్రం ఫ్యూచర్‌లో అమెరికన్ ఐటీ రంగానికే పెద్ద దెబ్బ పడటం ఖాయమన్న టాక్ నడుస్తోంది.

No UPI Day : అక్టోబర్ 2న డిజిటల్ షాక్.. ఆ ఒక్క కొత్త రూల్‌తో ఎవరికి ఇబ్బంది?

Related Articles

Back to top button