Junk Food :జంక్ ఫుడ్ బాగా తింటున్నారా? ..అవి సిగరెట్‌లంత డేంజర్ అని తెలుసా?
Junk Food : ప్యాకెట్ల మీద తక్కువ కొవ్వు (Low Fat) లేదా షుగర్ ఫ్రీ అని రాసి ఉన్నా కూడా, అవి కేవలం మార్కెటింగ్ ట్రిక్స్ మాత్రమేనని పరిశోధకులు తేల్చి చెప్పారు.
Junk Food
ఆకలితో సంబంధం లేకుండా , టైమ్‌తో అసలు పనే లేకుండా కొంత మంది జంక్ ఫుడ్(Junk Food) అలా తింటూనే ఉంటారు. అయితే బయట దొరికే ఆ చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్లు తినేటప్పుడు, చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు అవి మనకు ఎంత హాని చేస్తున్నాయో అస్సలు ఆలోచించరు.
కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రిలీజ్ చేసిన తాజా నివేదికలు చదివితే ఎవరైనా భయపడాల్సిందే.వీరిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ జంక్ ఫుడ్స్ (అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ – UPF) మన బాడీకి సిగరెట్ల కంటే ఎక్కువ హాని చేస్తున్నాయట. సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు ఎలా అయితే పాడవుతాయో,అలాగే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుందట.
అంతెందుకు పొగాకు ఉత్పత్తులకు ఎలా అయితే దూరంగా ఉండాలని చెబుతారో, అచ్చంగా అలాగే ఈ ఆహార పదార్థాల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి ఈ జంక్ ఫుడ్స్(Junk Food) తయారు చేసే కంపెనీలు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. మనం ఆ ఆహారానికి బానిసలయ్యేలా (Addiction) రకరకాల ఆర్టిఫిషియల్ రుచులు, కలర్స్ ,కెమికల్స్ కలుపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మనం ఒక చిప్స్ ప్యాకెట్ విప్పితే మాత్రం, అది ఖాళీ అయ్యే వరకు మన నోటికి పని చెబుతూనే ఉంటామన్న విషయాన్ని ఎపుడైనా గమనించారా?
దీనికి కారణం ఆ ఆహారం మన అందరి మెదడులోని రివార్డ్ సిస్టమ్‌ను ప్రేరేపిస్తుందట. అంటే అది తిన్నప్పుడు మనకు తెలీకుండానే ఒక రకమైన ఆనందం మనలో కలుగుతుంది, దాంతో పదే పదే వాటిని తినాలనిపిస్తుంది.
ప్యాకెట్ల మీద తక్కువ కొవ్వు (Low Fat) లేదా షుగర్ ఫ్రీ అని రాసి ఉన్నా కూడా, అవి కేవలం మార్కెటింగ్ ట్రిక్స్ మాత్రమేనని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. 1950లలో సిగరెట్ ఫిల్టర్లు సురక్షితమైనవని ఎలా అయితే అందరినీ నమ్మించారో, ఇప్పుడు ఈ కంపెనీలు కూడా అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దలవరకూ అందరినీ మభ్యపెడుతున్నాయి.

ఇలాంటి ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయని తేలింది. అందుకే పొగాకు కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చట్టాలను తెచ్చిందో, ఈ జంక్ ఫుడ్స్ విషయంలో కూడా అలాంటి నియమాలు ఉండాలని హార్వర్డ్ పరిశోధకులు కోరుతున్నారు.
మరోవైపు ఇలాంటివాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే, ప్యాక్ చేసిన బయట ఫుడ్స్ కంటే ఇంట్లో వండిన తాజా ఆహారం తీసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రంగురంగుల ప్యాకెట్లలో కనిపించేవి ఆహారం కాదని, అవి ఆరోగ్యాన్ని దెబ్బతీసే విషపూరిత పదార్థాలని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.





