Just InternationalJust PoliticalLatest News

Birthright Citizenship : ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టులో షాక్ ..జన్మతః పౌరసత్వ హక్కు రద్దుకు నిరాకరణ

Birthright Citizenship : అక్రమ వలసదారులు , టెంపరరీ వీసాలపై ఉన్నవారి పిల్లలకు దీనిని నిలిపివేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Birthright Citizenship

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా అత్యున్నత న్యాయ స్థానం భారీ షాకిచ్చింది. జన్మతః పౌరసత్వ హక్కు రద్దు విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు అమెరికా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌(Birthright Citizenship)ను రద్దుచేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జన్మతః పౌరసత్వ హక్కు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో తమ ఉత్తర్వులను అమలు చేస్తూ గతంలో ఉన్న చట్టాన్ని రద్దుచేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానం చెక్ పెట్టింది.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలను నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే జన్మతః పౌరసత్వ హక్కు రద్దు విషయంలో ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అమెరికాలో అక్రమ వలసలను, బర్త్ టూరిజం అరికట్టడానికి జన్మతః పౌరసత్వాన్ని(Birthright Citizenship) రద్దు చేయాలని భావించారు. ఈ విధానం అక్రమ వలసదారులకు పెద్ద ఆకర్షణగా ఉందని, దీనివల్ల విదేశీయులు అమెరికా సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని వాదించారు.

అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు పౌరసత్వం ఇచ్చే 100 ఏళ్ల నాటి సంప్రదాయానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రయత్నించారు.

అక్రమ వలసదారులు , టెంపరరీ వీసాలపై ఉన్నవారి పిల్లలకు దీనిని నిలిపివేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆయన జారీ చేసిన ఈ ఆదేశాలను కొంతమంది మానవ హక్కుల సంఘాలు న్యాయస్థానంలో సవాలు చేశాయి.

Birthright Citizenship
Birthright Citizenship

ఈ అంశంపై విచారణ జరిపిన అమెరికా అత్యున్నత న్యాయస్థానం ట్రంప్ ప్రతిపాదనలను, ఆయన జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కొట్టివేసింది. రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభించే హక్కు ఉందని స్పష్టం చేసింది.

అమెరికా పౌరసత్వం రావడం ద్వారా వలసదారుల కుటుంబాలు దేశంలోని ఉచిత విద్య, వైద్యం, సామాజిక భద్రతా పథకాలను అక్రమంగా వాడుకుంటున్నారని, దీనివల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందన్న ట్రంప్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు.

దీంతో ట్రంప్ జారీ చేసిన ఆర్డర్‌ను అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు వ్యతిరేకమని పేర్కొంటూ 6-3 మెజారిటీతో కొట్టివేసింది.

Ketan Agarwal : కేతన్‌ను సియా ఎక్కడి నుంచి తోసేసిందో చూడాలి..లోహగడ్ కోటకు క్యూ కడుతున్న టూరిస్టులు

Related Articles

Back to top button