Just InternationalJust LifestyleLatest News

Culdesac Tempe : కార్లకు నో ఎంట్రీ.. అమెరికాలోనే అత్యంత విచిత్రమైన ప్రదేశం ఎక్కడుందో తెలుసా?

Culdesac Tempe : సాధారణంగా రోడ్లు, గ్యారేజీలు, పార్కింగ్ కోసం వేస్ట్ అయ్యే ప్లేస్‌ను ఇక్కడ పచ్చటి చెట్లతో, విశాలమైన నడక మార్గాలతో, ఓపెన్ ప్లాజాలతో నిండిపోయి ఉంటుంది.

Culdesac Tempe

అమెరికా పేరు చెప్పగానే మనకందరికీ గుర్తొచ్చేది క్రమబద్ధంగా కార్లతో వెళ్లే రోడ్లు, మైళ్లకొద్దీ విస్తరించిన ఎక్స్‌ప్రెస్ మార్గాలు, ప్రతీ ఇంటి ముందు కనిపించే కాస్ట్‌లీ కార్లు. అంతగా అక్కడి వారి లైఫ్ కారుతో ముడిపడి ఉంటుంది. అక్కడ కారు లేకపోతే బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి.

అయితే అదే అమెరికాలో అసలు కార్లకే ఎంట్రీయే లేని, కారు పార్కింగ్‌లకు చోటే లేని ఒక డ్రీమ్ కమ్యూనిటీ ఒకటుందన్న విషయం కూడా ఎవరూ ఊహించలేరు. ప్రతి చిన్న పనికి కారు తీసే కల్చర్‌కు చెక్ పెడుతూ, కేవలం నడకతో, సైకిళ్లతోనే ప్రశాంతమైన జీవితాన్ని అక్కడ గడుపుతున్నారు.

అరిజోనా రాష్ట్రంలోని టెంపే సిటీలో రూపుదిద్దుకున్న ఈ కమ్యూనిటీ పేరు కల్డెసాక్ (Culdesac). సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది మోడల్ టౌన్‌షిప్ . సిటీ అనేది కార్ల కోసం కాదు, మనుషుల కోసం నిర్మించబడాలన్నదే ఈ టౌన్‌షిప్ కాన్సెప్ట్ .

ఇక్కడ ఇళ్లు కొనుక్కున్నా, లేదంటే రెంట్‌కు అద్దెకు దిగేవారికి ప్రైవేట్ కార్ పార్కింగ్ కూడా ఉండదు. దీంతో అక్కడెవరూ కారులు కొనరు. సాధారణంగా రోడ్లు, గ్యారేజీలు, పార్కింగ్ కోసం వేస్ట్ అయ్యే ప్లేస్‌ను ఇక్కడ పచ్చటి చెట్లతో, విశాలమైన నడక మార్గాలతో, ఓపెన్ ప్లాజాలతో నిండిపోయి ఉంటుంది. ఈ కమ్యూనిటీలో 55 శాతానికి పైగా స్థలం ప్రశాంతమైన ఓపెన్ స్పేస్‌తోనే ఉంటుంది.

కారు లేకపోవడం వరకూ ఓకే కానీ కూరగాయలు, నిత్యావసరాలు లేదంటే బయటకు వెళ్లాలంటే ఎలా అనే డౌట్ రావొచ్చు. ఇక్కడే వాకబిలిటీ మ్యాజిక్ ఉంది. బయటకు వెళ్లి కొన్ని అడుగులు వేస్తే చాలు.. రెస్టారెంట్లు, గ్రాసరీ షాపులు, కాఫీ కేఫ్‌లు, జిమ్‌లు, కో-వర్కింగ్ స్పేస్‌లు అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి కాస్త దూరంలో రైల్వే స్టేషన్ ఉంటుంది. కారుకు బదులు సైకిళ్లు, ఈ-బైక్స్, స్కూటర్లు చాలానే ఉంటాయి.

ఒకవేళ ఎమర్జెన్సీ కోసం కారు అవసరం పడితే, షేర్డ్ ఎలక్ట్రిక్ కార్లు లేదంటే ఉబెర్, ల్యాఫ్ట్ వంటి రైడ్ షేరింగ్ సర్వీసులను వాడుకోవచ్చు. అంటే కారును సొంతంగా మెయింటైన్ చేసే తిప్పలు ఇక్కడ ఉండవు. అయితే అవసరానికి మాత్రమే సర్వీస్‌గా వీటిని వాడుకునే అవకాశం ఉంటుంది.

Culdesac Tempe
Culdesac Tempe

నిజానికి ఇక్కడ కార్లు వాడకపోవడం వెనుక ఒక రీజన్ ఉంది. అరిజోనా అంటే విపరీతమైన ఎడారి వేడి ఉన్న ప్రాంతంలో ఇది ఉంటుంది. ఇక్కడ కార్లు వాడకపోవడం వల్ల ఆస్ఫాల్ట్ రోడ్ల వేడి తగ్గిపోతుంది. దీనికి తోడు తెల్లటి భవనాలతో పాటు సూర్యకాంతిని ప్రతిబింబించే నిర్మాణాలు, గాలి ప్రసరించే డిజైన్లు వాడి అక్కడ ఉష్ణోగ్రత బాగా తగ్గేలా చేస్తున్నారు.

పైగా కార్లు వాడే అలవాటు లేకపోవడంతో.. అందరూ నడుస్తూ ఒకరినొకరు పలకరించుకుంటారు. దీంతో పాటు కాలుష్యం తగ్గించడం, ఫిట్‌నెస్‌ని పెంచుకోవడం, కమ్యూనిటీ లైఫ్‌ని ఎంజాయ్ చేయడం అనే మూడు టార్గెట్‌లతో నడుస్తున్న కల్డెసాక్ కాన్సెప్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఉన్న టౌన్ ప్లానర్లందరినీ కూడా ఆకర్షిస్తోంది.

Carb Cravings : రైస్ తింటేనే పొట్ట ఫుల్ అనే ఫీలింగ్ వస్తోందా? ఇది ఆకలా లేక క్రేవింగా?

Related Articles

Back to top button