Just InternationalHealthLatest News

Ebola : కరోనా కష్టాలను గుర్తుంచుకుని ముందే అప్రమత్తం.. ఎబోలాపై పాత మందులు పనిచేయవా?

Ebola : ఎబోలా వైరస్ అనేది గబ్బిలాల నుంచి మనుషులకు వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ జబ్బు ఉన్న వ్యక్తి రక్తాన్ని గానీ, వారి ఒంటి నుంచి వచ్చే ద్రవాలను గానీ టచ్ చేసినా చాలు

Ebola

ఆఫ్రికాలోని కొన్ని కంట్రీలలో ఎబోలా(Ebola) వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తూ, ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది.

W.H.O తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హెచ్చరికల ప్రకారం.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులకు ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీ చేశారు.

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల ప్రకారం.. కాంగో, ఉగాండా, సూడాన్ లాంటి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టారు. విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి ఎయిర్‌పోర్టులలో కూడా స్పెషల్ మెడికల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

విమానాలతో పాటు సముద్ర మార్గాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే రోడ్డు మార్గాల దగ్గర కూడా తనిఖీలు చేయడానికి అధికారులు రెడీ అవుతున్నారు. ఎవరికైనా ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నట్లు కనుక అనుమానం వస్తే, వారిని విమానాశ్రయం దాటి బయటకు రాకముందే గుర్తించి, వెంటనే ప్రత్యేకంగా రెడీ చేసిన వార్డులకు తరలించి ట్రీట్మెంట్ అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎబోలా వైరస్ అనేది గబ్బిలాల నుంచి మనుషులకు వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ జబ్బు ఉన్న వ్యక్తి రక్తాన్ని గానీ, వారి ఒంటి నుంచి వచ్చే ద్రవాలను గానీ టచ్ చేసినా చాలు.. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా అంటుకుంటుంది. ఈ వైరస్ శరీరంలో చేరిన తర్వాత సుమారు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రాణంతో ఉండి ఇబ్బంది పెడుతుంది.

విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, హెడేక్, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు రావడం దీని ముఖ్య లక్షణాలు అని డాక్టర్లు చెబుతున్నారు. దీని ట్రీట్మెంట్ లేట్ అయితే లివర్, కిడ్నీలు పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది.

అయితే ప్రస్తుతం ఆఫ్రికాలో కనిపిస్తున్న ఈ కొత్త రకం(Ebola) వైరస్ లక్షణాలు.. సాధారణంగా వచ్చే ఫ్లూ జ్వరం, టైఫాయిడ్ లేదా మలేరియా లాగే ఉండటం వల్ల దీనిని కనిపెట్టడం డాక్టర్లకు పెద్ద సవాలుగా మారింది. దీనికి తోడు, పాత వైరస్ కోసం తయారు చేసిన వ్యాక్సిన్లు.. ఈ కొత్త రకం వైరస్‌పై సరిగ్గా పనిచేయడం లేదని డాక్టర్లు తేల్చారు.

Ebola
Ebola

కరోనా సమయంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుంచుకున్న ప్రభుత్వం..ఈసారి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఏపీలోని పెద్ద పెద్ద ఆసుపత్రులలో స్పెషల్ వార్డులను సిద్ధం చేయడమే కాకుండా, డాక్టర్లకు కావలసిన కిట్లను, టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచారు.

ఆఫ్రికాలో ఇప్పటికే వందలాది మందికి ఈ జబ్బు సోకిందని..సుమారు రెండు వందల నాలుగు మంది చనిపోయారని తెలుస్తోంది. అందుకే అత్యవసరమైన పని ఉంటే తప్ప ప్రజలు ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మకుండా, ప్రభుత్వం చెప్పే విషయాలను ఫాలో అవ్వాలని అధికారులు కోరారు.

Qualifier 1 : క్వాలిఫైయర్ 1కు వర్షం ముప్పు ?..ఒకవేళ రద్దయితే ఫైనల్ చేరేది ఆ జట్టే

Related Articles

Back to top button