Just InternationalHealthLatest News

Ebola Virus : మరోసారి లాక్ డౌన్ తప్పదా ?..ఆఫ్రికాలో ఎబోలా మరణ మృదంగ

Ebola Virus : ఎబోలా వైరస్ రూపంలో మరో మహమ్మారి వణికిస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎబోలా ధాటికి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు

Ebola Virus

కరోనా మహమ్మారి తర్వాత పలు కొత్త వైరస్ లు ప్రపంచ దేశాలపై దాడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఎబోలా వైరస్(Ebola Virus) రూపంలో మరో మహమ్మారి వణికిస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎబోలా ధాటికి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలోనే ఈ వైరస్ ను గుర్తించినా ఇప్పుడు విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కాంగోలో మొత్తం 867 మంది ఈ వైరస్ బారిన పడగా.. 204 మంది మృతి చెందారు. ఈ క్రమంలో కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాలకు ఎబోలా పాకిపోయింది.

దీంతో వందలాది మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆఫ్రికాలోని పలు దేశాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అటు అక్కడి ప్రభుత్వాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. మరో 10 ఆఫ్రికా దేశాలకు ఎబోలా ముప్పు పొంచి ఉందని ఆఫ్రికా సీడీసీ తెలిపింది.కెన్యా, రువాండా, దక్షిణ సూడాన్, టాంజానియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, జాంబియా,అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లను ప్రమాదంలో ఉన్న దేశాలుగా గుర్తించారు.

ఎబోలాలో అత్యంత అరుదైన బుండిబుగ్యో స్ట్రెయిన్ కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని గుర్తించారు. ఈ తరహా కేసులు ఎక్కువగా కాంగోలో నమోదవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ ను 2007లో తొలిసారిగా ఉగాండాలో గుర్తించారు. లక్షణాలు కరోనా తరహాలోనే జ్వరం, జలుబు, దగ్గు, కండరాల నొప్పి, తల నొప్పి లాంటివి ఎక్కువగా ఉంటాయి.

ఎబోలా వైరస్(Ebola Virus) లక్షణాలు ఉన్న వారు వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ వో సూచిస్తోంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గితే ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించింది. దీంతో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతంలో కట్టడి చేయడం కూడా చాల కష్టమని డబ్ల్యూహెచ్ వో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న పరిస్థితిని చూస్తుంటే మరో లాక్ డౌన్ తరహా నియంత్రణ తప్పదేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.

Ebola Virus
Ebola Virus

మన దేశంలో ప్రస్తుతానికి ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదు. అయినా సరే జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో ఈ వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఆఫ్రికా దేశాల నుంచి స్వదేశానికి వస్తున్న వారిని ఎయిర్ పోర్టులో ఆపి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే 21 రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని కూడా పర్యవేక్షించనున్నారు. కాగా ప్రజలు అవసరమైతే తప్ప ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలు చేయొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ సైతం సూచించింది.

HILT Policy:హిల్ట్ పాలసీపై రాజుకున్న రాజకీయ రచ్చ.. ప్రతిపక్షాల ఆరోపణల నడుమే గైడ్‌లైన్స్ విడుదల

Related Articles

Back to top button