Just InternationalLatest News

Philippines: ఫిలిప్పీన్స్‌లో మెరుపు వరదలు..  సూపర్ టైపూన్‌తో అతలాకుతలం

Philippines: సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫిలిప్పీన్స్ (Philippines)తూర్పు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే భారీ వర్షాలు, భీకర గాలులు వీస్తన్నట్టు అధికారులు తెలిపారు.

Philippines

ఫిలీప్పీన్స్ (Philippines)ను సూపర్ టైపూన్ వణికిస్తోంది. భారీ వర్షాలతో వరుస తుఫాన్లకు మెరుపు వరదలు తోడవడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.  కొన్ని రోజులుగా ఫిలిప్పీన్స్ భారీ నుంచి అతి భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. తదనంతర పరిణామాలతో తీవ్ర తుఫానుగా మారి అరోరా ప్రావిన్స్ లో తీరాన్ని తాకింది. ఈ తీవ్ర తుఫాను కారణంగా గంటకు 230 కిలోమీటర్ల వేగంతో భీకరగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం, అలలు 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిసిపడే ప్రమాదముండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.

సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫిలిప్పీన్స్ (Philippines)తూర్పు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే భారీ వర్షాలు, భీకర గాలులు వీస్తన్నట్టు అధికారులు తెలిపారు. కాటాండువాన్స్ ద్వీపంతో పాటు, ఇతర లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లోని నివాసితులను ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా బికోల్, తూర్పు విసాయాస్ లను సైతం వరదలు ముంచెత్తాయి. గిగ్మోట్, ఇసాబెలాలోని డైనపిగ్ వంటి తీర ప్రాంతాల్లో రాకసి అలలు విరుచుకుపడ్డాయి.

Philippines
Philippines

సముద్ర తీర ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు ప్రజలను, పర్యాటకులను హెచ్చరించారు. కాగా తుఫాను దెబ్బకు వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

తీవ్ర తుఫాను ప్రభావంతో పలు ఎయిర్ పోర్టులను మూసివేశారు. విమాన సర్వీసులు కూాడా చాలా వరకూ రద్దయ్యాయి. దాదాపు 400కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు తెలుస్తోంది. స్థానికంగా స్కూల్స్ , కాలేజీలు, విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. కాగా దేశంలో ఎక్కువ జనాభా ఉన్న లూజాన్ ద్వీపంలో 18వందల కిలోమీటర్ల మేర ఈ తుఫాను విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పసిఫిక్ మహాసముద్ర ఉష్ణమండల వాతావరణానికి దగ్గరగా ఉండే ఫిలిప్పీన్స్ కు తుఫాన్లు రావడం కొత్తేమీ కాదు. తరచుగా తుఫాన్లు, వరదలు వస్తూనే ఉంటాయి, ఈ సారి మాత్రం గత ప్రకృతి వైపరీత్యాల కంటే భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ లో వచ్చిన 21వ తుపాను ఇది.

Red Fort: ఎర్రకోట దగ్గర బాంబు పేలుళ్లు..  ఉలిక్కిపడ్డ దేశ రాజధాని

Related Articles

Back to top button