Just SpiritualLatest News

Lord Shiva:సోమవారం శివయ్య అనుగ్రహం ఎలా పొందాలి? ఆరోజు ఏం చేయాలి?

Lord Shiva: శివ లింగానికి శుద్ధ జలంతో అభిషేకం చేసినా కూడా మనసులోని ఆందోళనలు తొలగి శాంతి లభిస్తుంది.

Lord Shiva

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వారంలో ఒక్కో రోజు ఒక దేవతకు అంకితం చేయబడింది. అలా సోమవారం మాత్రం సాక్షాత్తు ఆ కైలాసనాథుడైన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించి భక్తులు కొలుస్తారు.

మనిషి మనసుపై ప్రభావం చూపే చంద్రుడికి అధిపతి శివుడు(Lord Shiva) కాబట్టి, సోమవారం శివారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయని పురాణాలు చెబుతాయి. ముఖ్యంగా అభిషేక ప్రియుడు అని పేరుగాంచిన శివుడికి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకానికి విశిష్టమైన ఫలితాలుంటాయట.

శివ లింగానికి శుద్ధ జలంతో అభిషేకం చేసినా కూడా మనసులోని ఆందోళనలు తొలగి శాంతి లభిస్తుంది.అలాగే ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయట. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతాయి.

ఇక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేస్తే.. లక్ష్మీ కటాక్షం కలిగి దారిద్య్రం తొలగిపోతుందని శివపురాణం చెబుతోంది. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం సిద్ధిస్తాయి.

అంతేకాకుండా శివుడి(Lord Shiva)కి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రం సమర్పించేటప్పుడు మూడు ఆకులు ఉన్న దళాన్ని మాత్రమే వాడాలి. ఒక్క బిల్వ దళం సమర్పిస్తే మూడు జన్మల పాపాలు నశిస్తాయని పండితులు చెబుతారు.

Lord Shiva
Lord Shiva

అయితే సోమవారం రోజు ఉపవాసం ఉండి, సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించాలి. అలాగే శివలింగం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

మహా శివుడిని పూజించేటప్పుడు ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. గృహస్తులు శివలింగానికి ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు, అయితే అభిషేక జలాన్ని కాళ్ల కింద పడకుండా మాత్రం

జాగ్రత్త పడాలి. శివుడు భోళాశంకరుడు, మీరు కేవలం ఒక గ్లాసు నీటిని భక్తితో సమర్పించినా ఆయన తృప్తి చెంది మీకు రక్షణగా నిలుస్తాడు. ఈ సోమవారం ఆ మహాదేవుడి ఆశీస్సులతో మీ జీవితం ధన్యమవ్వాలని కోరుకుందాం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

One Comment

Back to top button