Gold Rate : ఇంటర్నేషనల్ టెన్షన్స్ దెబ్బ.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్
Gold Rate : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా టారిఫ్‌లను ప్రకటించడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు వేగంగా పెరుగుతున్నాయి.
Gold Rate
గోల్డ్ లవర్స్‌కు పసిడి ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్ల అదే కంటిన్యుటీని కొనసాగిస్తోంది. వరల్డ్ వైడ్‌గా అమెరికా ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలు పుంజుకోవడం పసిడిపై పడింది.
దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా టారిఫ్‌లను ప్రకటించడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు శరవేగంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ మార్పులు ఇలాగే కొనసాగవచ్చంటూ బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర(Gold Rate) రూ. 1లక్ష47వేల280 కి చేరింది. ఒక్కరోజే దీనిపై రూ. 770 వరకూ పెరిగింది. అలాగే ఆర్నమెంట్స్ తయారీకి వాడే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 700 పెరిగి రూ. 1లక్షల35వేల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలో ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. బెంగళూరు, ముంబైలలో 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1లక్ష47వేల 280 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ. 1లక్ష35వేల వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ. 1లక్ష47వేల 420 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష35వేల150 వద్ద ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1లక్ష46వేల 520 గానూ, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1లక్ష34వేల310 గానూ నమోదయ్యాయి.
మరోవైపు సిల్వర్ ధరలు మాత్రం పెద్దగా మారకుండా స్థిరంగానే ముగిసాయి. దేశీయంగా కిలో సిల్వర్ ధర దాదాపు రూ. 2.40 లక్షల దగ్గర ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై నగరాల్లో కేజీ వెండి ధర రూ. 2లక్షల45వేల100 వద్ద ట్రేడ్ అవుతోంది.
OpenAI : మార్కుల కోసం హ్యాకింగ్ చేసిన ఏఐ.. రియల్ వరల్డ్ సర్వర్లపై దాడి





