Asia Cup : హాకీ మైదానంలో పవర్ చూపించిన భారత్.. వరుసగా మూడోసారి ఆసియా కప్ కైవసం..
Asia Cup : ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ ఫైట్‌లో బలమైన చైనా జట్టును 1-0 తేడాతో మట్టికరిపించి, భారత్ యువ సంచలనాలు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్నారు.
Asia Cup
మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్‌లో భారత్ మరోసారి హిస్టరీ క్రియేట్ చేసింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ ఫైట్‌లో బలమైన చైనా జట్టును 1-0 తేడాతో మట్టికరిపించి, భారత్ యువ సంచలనాలు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్నారు.
ఈ అద్భుత విజయంతో విమెన్ హాకీ టీమ్ వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ రికార్డును తమ అకౌంట్లో వేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన క్రీడాకారిణులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఛైర్మన్ రవినాయుడు అభినందించారు.
చైనాతో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎంతో టెన్షన్ టెన్షన్‌గా సాగింది. రెండు జట్లు డిఫెన్స్‌లో హోరాహోరీగా తలపడటంతో ప్రతి నిమిషం కూడా ఉత్కంఠను రేపింది.
అయితే మైదానంలో అద్భుతమైన గేమ్ స్ట్రాటజీలు, పక్కా ప్లానింగ్‌తో ఆడిన భారత యువ క్రీడాకారిణులు కీలకమైన ఒక గోల్ సాధించి విక్టరీని సొంతం చేసుకున్నారు. లాస్ట్ మినిట్ వరకు ప్రత్యర్థి టీమ్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఆటతీరుతో చైనాను అడ్డుకుంటూ ఛాంపియన్లుగా నిలిచారు.

ఆసియా ఖండంలో భారతదేశపు జెండాను మన క్రీడాకారిణులు మరోసారి రెపరెపలాడించి, దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంతో అభినందనల వర్షం కురుస్తోంది. వరుసగా మూడోసారి టైటిల్ సాధించడమనేది సాధారమైన విషయం కాదని, యువ ప్లేయర్ల క్రమశిక్షణే ఈ విజయానికి కారణమంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Khairatabad Ganesha : 7 దశాబ్దాల ఖైరతాబాద్ గణపయ్య.. 69 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణేషుడు ప్రత్యేకత ఇదే..





