Kim Jong : ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్..ఆ భారీ యుద్ధనౌక వెనుక ప్లాన్ ఏంటి ?
Kim Jong : గత దశాబ్ద కాలంగా క్షిపణులతోనే కాకుండా అణ్వాయుధాల పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టిన కిమ్ ఇప్పుడు మరో భారీ స్కెచ్ తో సిద్ధమయ్యారు. ఈసారి తన వ్యూాహాన్ని నేవీ వైపు తిప్పారు.
Kim Jong
కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ సంచలనానికి తెరతీశాడు. ప్రపంచ దేశాలకు టెన్షన్ పుట్టించే విధంగా ఏదో చేస్తున్నారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా క్షిపణులతోనే కాకుండా అణ్వాయుధాల పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టిన కిమ్ ఇప్పుడు మరో భారీ స్కెచ్ తో సిద్ధమయ్యారు.
ఈసారి తన వ్యూాహాన్ని నేవీ వైపు తిప్పారు. సముద్ర మార్గంలో తమ ఆయుధ శక్తిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా భారీ యుద్ధనౌకల నిర్మాణానికి తెరతీసారు. సాధారణ నావికా దళం, ఇతర ఆయుధాలైతే పెద్ద టెన్షన్ ఉండేది కాదు. కానీ కిమ్(Kim Jong) చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
అణ్వాయుధ శక్తితో తమ నేవీని బలోపేతం చేయబోతున్నామనీ, అందుకే సరికొత్త అస్త్రాన్ని నావికాదళంలో చేరుస్తున్నట్టు కిమ్ ప్రకటించారు. తాజాగా తమ నౌకా దళంలో చోయ్ హ్యోన్ అనే భారీ యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. ఉత్తరకొరియా చరిత్రలోనే భారీగా ఆయుధాలు అమర్చిన నౌకగా దీనిని చెబుతున్నారు.
ఈ యుద్ధనౌక బరువు దాదాపు 5 వేల టన్నుల పైమాటే. నిజానికి ఈ భారీ యుద్ధనౌకను గత ఏడాదే ప్రారంభించారు. అయితే 14 నెలల పాటు చాలా క్లిష్టమైన సైనిక పరీక్షలు పూర్తి చేసుకుని ఇప్పుడు అధికారికంగా విధుల్లో చేరింది.
విమాన విధ్వంసక వ్యవస్థలు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉన్నట్టు తెలుస్తోంది.. ముఖ్యంగా అణు సామర్థ్యం కలిగిన క్షిపణులను సముద్రం నుంచి ప్రయోగించడం ప్రత్యేకతగా భావిస్తున్నారు.ఒకవేళ అది నిజమైతే మాత్రం ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టే విషయంగానే చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ నౌకను ప్రారంభించిన సందర్భంగా ఉత్తర కొరియా చీఫ్ కిమ్(Kim Jong) కీలక ప్రకటన కూాడా చేశారు. రాబోయే ఐదేళ్ల కోసం భారీ స్థాయిలో రక్షణ ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. కాంగ్ కాన్ పేరుతో మరో భారీ యుద్ధనౌకను బరిలోకి దించనున్నట్టు ప్రకటించారు. దాని బరువు పదివేల టన్నులు.
కిమ్ ప్లాన్ ప్రకారం ఉత్తరకొరియా ప్రతీ ఏడాది కనీసం రెండు యుద్ధనౌకలను తయారు చేయనుంది. ఈ మేరకు కిమ్ తన అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పైకి వీటిని సాధారణ యుద్ధ నౌకలుగానే చెబుతున్నా భారీ ఆయుధాలను, అందులోనూ అణ్వాయుధాలను కూడా ప్రయోగించగలిగే సామర్థ్యం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రపంచానికి ముప్పు తెస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Venezuela : భూకంపం వచ్చే ముందే అలర్ట్ చేసిన గూగుల్.. వెనెజువెలా ఘటనతో వెలుగులోకి ఈ టెక్నాలజీ





