Just InternationalJust NationalLatest News

Petrol : పెట్రో బాదుడు ఆగేదెన్నడు ?..సామాన్యులపై పెను భారం

Petrol : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరపడే వరకు లేదా చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ పాత నష్టాలను పూర్తిగా పూడ్చుకునే వరకు పెట్రో బాదుడు ఆగే అవకాశం లేదని తేలిపోయింది

Petrol

దేశంలో పెట్రోధరల పెంపుకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే అవకాశం లేదు. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో ఐదుసార్లు పెరిగిన పెట్రోల్(Petrol), డీజిల్ ధరలు ఇంకా పెరుగుతూనే ఉంటాయని సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు వరకూ పెట్రో ధరల పెంపుపై సైలెంట్ గా ఉన్న ప్రభుత్వం, చమురు కంపెనీలు ఇప్పుడు వరుసగా పెంచుకుంటూ పోతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరపడే వరకు లేదా చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ పాత నష్టాలను పూర్తిగా పూడ్చుకునే వరకు పెట్రో(Petrol )బాదుడు ఆగే అవకాశం లేదని తేలిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్(Petrol) ధర రూ. 115.80గా ఉంటే డీజిల్ ధర రూ. 103.82 గా ఉంది. చెప్పాలంటే ఇవి రికార్డు స్థాయికి చేరినట్టే.

పెట్రో ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలను చూస్తే పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం ప్రధానంగా చెప్పొచ్చు. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు , ముడి చమురు ధరల అస్థిరత ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతోంది. గతంలో అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు భరించిన నష్టాలను ఇప్పుడు కంపెనీలు రికవరీ చేసుకుంటున్నాయి.

కొన్ని వారాల క్రితం ఇరాన్ సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఆ భారాన్ని నేరుగా ప్రజలపై వేయలేదు. నష్టాలను భరిస్తూ తక్కువ ధరలకే ఇంధనాన్ని అమ్మాయి. ఇప్పుడు క్రూడాయిల్ రేట్లు కాస్త తగ్గినా సరే, ఆ కంపెనీలు తమ పాత నష్టాలను పూడ్చుకునే పనిలో పడ్డాయి. అందుకే గ్లోబల్ రేట్లు తగ్గినా.. ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

క్రూడాయిల్‌లో దాదాపు 85 నుంచి 90 శాతం వరకు ఇతర దేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా చమురును డాలర్లలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి విలువ బాగా బలహీనపడింది. ఒక దశలో రూపాయి రికార్డు స్థాయిలో 97 మార్కును తాకింది.

Petrol
Petrol

దీనివల్ల గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ రేటు తగ్గినా, డాలర్లలో చెల్లించాల్సి రావడం వల్ల మన రిఫైనరీలకు దిగుమతి ఖర్చులు భారంగానే మారాయి. వీటిని తట్టుకోలేక, ప్రస్తుత సంక్షోభంతో మరింత భారం పడడంతో కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. అయితే వీటికి నిపుణులు సూచిస్తున్న కొన్ని పరిష్కార మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ , ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే వినియోగదారులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెటింగ్ నిపుణుల అంచనా ప్రకారం మరో 20 రూపాయల వరకూ పెట్రో ధరలు పెరిగే అవకాశముంది. ఒకేసారి కాకున్నా విడతల వారీగా ఈ పెంపు ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు.

RCB : ఫైనల్లో బెంగళూరు..చిత్తుగా ఓడిన గుజరాత్

Related Articles

Back to top button