Pune Murder Case : పూణే మర్డర్ కేసులో ఎవరిది తప్పు? ఆ ముగ్గురు తండ్రుల గుండెకోతకు కారణం ఏంటి?
Pune Murder Case : ఒక్క దారుణం వల్ల ఇద్దరు అబ్బాయిల జీవితాలు నాశనమవడమే కాకుండా, ముగ్గురు తండ్రులు అనుభవిస్తున్న నరకయాతన సమాజాన్ని ఆలోచింపజేస్తోంది.
Pune Murder Case
ప్రేమ, పెళ్లి అనేవి నమ్మకం మీద నడిచే బంధాలే అయినా.. ఒకరితో జీవితాన్ని పంచుకోవడం ఇష్టం లేనప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పి తప్పుకోగల ధైర్యం కూడా ఉండాలి. ఈ సొసైటీలో ఇప్పుడు చాలా మంది చేస్తుంది కూడా అదే.
కాకపోతే కొంతమంది మాత్రం చట్టం నుంచి తప్పించుకుంటామని ధైర్యమో లేక దొరికిపోమన్న కాన్ఫిడెన్స్‌తోనో ఈజీగా మర్డర్లు చేస్తున్నారు. భర్తను భార్య, భార్యను భర్త, పిల్లలను పేరెంట్స్, లవర్స్ ఇలా ఎవరు ఎప్పుడు ఎవర్ని చంపుతున్నారో తెలీని పరిస్థితిలోకి సొసైటీ వెళ్లిపోతోంది.
తాజాగా ఇలాగే మహారాష్ట్రలోని పూణే లోహగడ్(Pune Murder Case) కోట వద్ద జరిగిన ఒక ఘోరమైన హత్య మాత్రం మానవ సంబంధాల వెనుకున్న అత్యంత క్రూరమైన మానసిక కోణాన్ని బయటపెట్టింది. కాబోయే భర్తను లవర్‌తో కలిసి 400 అడుగుల లోయలోకి తోసేసి చంపిన 20 ఏళ్ల సియా గోయల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ ఒక్క దారుణం వల్ల ఇద్దరు అబ్బాయిల జీవితాలు నాశనమవడమే కాకుండా, ముగ్గురు తండ్రులు అనుభవిస్తున్న నరకయాతన సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ఒకరి కొడుకు ప్రాణాలు కోల్పోతే, ఇంకొకరి కొడుకు జైలు పాలయ్యాడు. ఇంకొకరి కూతురు ఇలాంటి దారుణానికి కర్త, కర్మ, క్రియ అయిన సియా గోయల్ జైలు ఊచలు లెక్కపెడుతోంది.
ఈ కథలో మొదటి వ్యక్తి, ప్రాణాలు కోల్పోయిన 26 సంవత్సరాల కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్న తన కొడుకు నవంబర్‌లో పెళ్లి చేసుకొని కొత్త లైఫ్‌ను ప్రారంభిస్తాడని ఆ తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు భూమి మీదే లేకుండా పోయిన కొడుకును తలుచుకుని ఆయన గుండెలు బాదుకుంటున్నారు.
సియాకు ఇంకొకరితో అఫైర్ ఉంటే వాట్సాప్‌లో ఒక్క ఫోటో పంపినా మ్యారేజ్ ఆపేసేవాళ్లం కదా, ఇంత చిన్న విషయానికి నా కొడుకును చంపాలా అంటూ ఆయన ఏడుస్తున్న తీరు ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది.
సైకాలజీ ప్రకారం ఇలాంటి అకస్మాత్తు విపత్తు జరిగినప్పుడు తల్లిదండ్రులు తీవ్రమైన ట్రామా అండ్ గిల్ట్‌లోకి వెళ్లిపోతుంటారు. ఆ అమ్మాయిని కోడలిగా ఎంచుకొని తామే ముందు తప్పు చేశామా అనే బాధ వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.
ఇక ఈ కేసులో రెండో వ్యక్తి, నిందితుడిగా జైలుకు వెళ్లిన 22 సంవత్సరాల చేతన్ చౌదరి తండ్రి బాబూలాల్ చౌదరి. ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ,తన కొడుకు మంచి క్రీడాకారుడని, బుద్ధిమంతుడని గుడ్డిగా నమ్మిన ఒక సామాన్య తండ్రి.
పోలీస్ స్టేషన్లో సియాను చూసేవరకు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని బాబూలాల్ వాపోతున్నారు. తన కొడుకు అమాయకుడని, ఆ అమ్మాయే ఇరికించిందని చెబుతున్నారు.
సైకాలజీ ప్రకారం చూస్తే.. ఏ తండ్రికైనా తన కొడుకు ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడనే నిజాన్ని నమ్మడం చాలా కష్టం. సొసైటీ ముందు తలెత్తుకోలేక, కొడుకు భవిష్యత్తు నాశనమైపోయిందనే ఆందోళన , నిస్సహాయతలలో ఈ తండ్రి కొట్టుమిట్టాడుతున్నారు.
మరి ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన సియా గోయల్ తండ్రి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కూతురు ఒకరి ప్రాణాలను తీసి, మరొకరిని జైలు పాలు చేసిందని తెలిసినప్పుడు ఆ తండ్రి అనుభవించే గిల్టీ ఫీలింగ్ వర్ణనాతీతం.
సొసైటీలో ఆ కుటుంబం జీవితాంతం అవమానాన్ని, ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సిందే. తన పెంపకంలో ఎక్కడ తప్పు జరిగిందని ఆ తండ్రి లోలోపల నలిగిపోవాల్సిందే. తన కన్నకూతురే ఇంతటి క్రూరమైన మనస్తత్వం కలిగి ఉందని అంగీకరించడం ఏ తండ్రికైనా బతికుండీ చనిపోవడంతోనే సమానం అవుతుంది.
అసలు సియా ఎందుకు ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టింది అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. చేతన్‌తో ఉన్న ప్రేమను ఇంట్లో చెప్పే ధైర్యం లేక, అలాగని కేతన్‌ను పెళ్లి చేసుకునే ఇష్టం లేక హత్యకు స్కెచ్ గీసింది. పేరెంట్స్ ఒత్తిడి వల్లో , ఆస్తి కోసమో పెళ్లికి ఒప్పుకొని, ఆ తర్వాత కేతన్ అడ్డు తొలగించుకుంటే అటు ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చనే శాడిస్ట్ ఆలోచనకు తెరలేపింది.
దీనిలో భాగంగానే మే 31, జూన్ 4, జూన్ 14 తేదీలలో వరుసగా 3 సార్లు చంపడానికి ప్రయత్నించి ఫెయిలైనా, వెనక్కు తగ్గకుండా జూన్ 18 వ తేదీన పక్కా స్కెచ్‌తో నాలుగోసారి లోయలోకి తోసి చంపేసింది. ఒక మనిషి ప్రాణం కంటే తన స్వార్థమే ఎక్కువ అనుకునే నార్సిసిస్టిక్ మెంటాలిటీ సియాది అని సైకాలజీ చెబుతోంది.

కానీ పాపం పండి కేతన్ సోదరి సంజనకు వచ్చిన అనుమానంతో ఈ (Pune Murder Case) మర్డర్ కేసు వీడింది. జూన్ 18 వతేదీన పూణేలో ఎండలు దంచికొడుతున్నా, నిందితుడు చేతన్ తలకు హుడీ వేసుకుని తిరగడం సీసీటీవీలో కనిపించడం ఈ కేసుకు దారి చూపించినట్లు అయింది.
అంతేకాదు సియా, చేతన్ ఆరు నెలల్లో 2 వేల సార్లకు పైగా, సుమారు 238 గంటలు ఫోన్లలో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా తేల్చింది. మొత్తంగా సియా మైండ్ గేమ్ వల్ల ఒక యువ వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోగా, ఒక క్రీడాకారుడు హంతకుడిగా మారాడు.
Kim Jong : ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్..ఆ భారీ యుద్ధనౌక వెనుక ప్లాన్ ఏంటి ?





