Pilot Smit Machchhar : ఫ్లైట్ విధ్వంసాన్ని అడ్డుకున్న రియల్ హీరో.. ట్రంప్, మోదీ, నెతన్యాహూ సెల్యూట్..
Pilot Smit Machchhar : శరీరం నిండా కత్తిపోట్లతో ఓవైపు ఒంటి నిండా రక్తంతో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చార్.. మాతృభూమి ఇచ్చిన ధైర్యంతో ప్రాణాలకు తెగించి నిలబడ్డారు.
Pilot Smit Machchhar
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళుతున్న ఆ బోయింగ్ 737 మ్యాక్స్-8 జెట్‌లో 174 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సడన్‌గా ఒమన్ జాతీయుడైన కో-పైలట్ కాక్‌పిట్‌లో సైకోలా మారిపోయాడు. కత్తితో కెప్టెన్‌పై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా.. ఫ్లైట్ కంట్రోలింగ్ సిస్టమ్స్‌ను ధ్వంసం చేసి, ప్రయాణికులతో సహా జెట్‌ను కూల్చడానికి ప్రయత్నించాడు.
దీంతో కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఆ విమానం ఒక్కసారిగా 14,000 అడుగుల కిందికి పడిపోతూ మృత్యువు అంచుల వరకు వెళ్లింది. కానీ, ఆ సైకో దాడిలో శరీరం నిండా కత్తిపోట్లతో ఓవైపు ఒంటి నిండా రక్తంతో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చార్.. మాతృభూమి ఇచ్చిన ధైర్యంతో ప్రాణాలకు తెగించి నిలబడ్డారు.
ఒంట్లో బలం నశిస్తున్నా క్షణం కూడా లేట్ చేయకుండా కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేసి గట్టిగా కేకలు వేశారు కెప్టెన్ స్మిత్(Pilot Smit Machchhar). విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనవడం, కాక్‌పిట్ నుంచి అరుపులు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆ సమయంలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న యానివ్ అనే ఇజ్రాయిల్‌కు చెందిన వ్యక్తి రియల్ హీరోలా మారాడు. టీవీల్లో వచ్చే ఎయిర్ డిజాస్టర్స్ వీడియోలు చూసి ఫ్లైట్స్ కంట్రోల్స్‌పై కొంత అవేర్నెస్ పెంచుకున్న యానివ్.. మిగిలిన ప్రయాణికులతో కలిసి కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి ఆ సైకో కో-పైలట్‌ను సీటు నుంచి వెనక్కి లాగి గట్టిగా బంధించారు.
అదే విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్ డ్యూటీ పైలట్లు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి కాక్‌పిట్ కంట్రోల్స్ అందుకుని, కిందకి దూసుకుపోతున్న జెట్‌ను అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని తబూక్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అక్కడ సుమారు 8 గంటల వెయిటింగ్ తర్వాత ప్రయాణికులందరినీ వేరే ఫ్లైట్‌లో టెల్ అవీవ్‌కు సేఫ్‌గా తరలించారు.
గుజరాత్‌కు చెందిన స్మిత్ మచ్చార్కి ఏవియేషన్ రష్యాలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. జూన్ 2011 నుంచి 2022 వరకు సుమారు 11 ఏళ్ల పాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్‌లో సర్వీసులు అందించి.. జూన్ 2022లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా ఫ్లైదుబాయ్‌లో అడుగుపెట్టారు.
వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాను పొందిన స్మిత్ మచ్చార్‌కు.. బోయింగ్ 737 విమానాలను నడపడంలో చాలా ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాపాయం నుంచి తేరుకుంటున్న స్మిత్ ఆరోగ్య పరిస్థితిని భారత దౌత్య కార్యాలయం కంటిన్యూగా పర్యవేక్షిస్తూ ఆయన కుటుంబానికి అండగా నిలిచింది.

తన అసాధారణమైన పోరాటంతో కెప్టెన్ స్మిత్ మచ్చార్కి ప్రపంచ అధినేతలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో రిలీజ్ చేస్తూ.. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినా వందలాది ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చార్(Pilot Smit Machchhar) రియల్ హీరో అని, ఆయన ధైర్యం మరువలేనిదని ప్రశంసించారు.
అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో మాట్లాడుతూ ..తీవ్ర గాయాలైనా కూడా స్మిత్ చూపిన సమయస్ఫూర్తి నిజంగా అద్భుతమని అతను రియల్ హీరో అని పొగిడారు. అలాగే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఎక్స్ వేదికగా భారత పైలట్ అసాధారణ సాహసానికి తన సెల్యూట్ అని పోస్ట్ చేశారు.
Captain Smit Machchhar is a HERO.
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of…
— Narendra Modi (@narendramodi) October 1, 2026
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) September 30, 2026
Emotional Immaturity : ఎమోషనల్ ఇన్ మెచ్యూరిటీకి చెక్ పెట్టే 4 గోల్డెన్ రూల్స్





