Just InternationalJust PoliticalLatest News

PM Modi US Visit : ప్రధాని మోదీ అమెరికా బాట..జీ20 వేదికగా మారనున్న గ్లోబల్ సమీకరణాలు

PM Modi US Visit : ప్రధాని నరేంద్ర మోదీ ..డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే ద్వైపాక్షిక చర్చలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలుస్తుంది.

PM Modi US Visit

అంతర్జాతీయ దౌత్య సమీకరణాలు చాలా వేగంగా మారుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లబోయే అమెరికా పర్యటన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 14వ తేదీ, 15 తేదీల్లో ఫ్లోరిడాలోని డొరల్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది

2009వ సంవత్సరం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో జీ20 శిఖరాగ్ర సదస్సు అమెరికా గడ్డపై జరగనుంది. విదేశాంగ శాఖ నుంచి ఇంకా అఫీషియల్ ప్రకటన వెలువడకపోయినా..ఈ పర్యటన ఖరారైతే భారతదేశపు ప్రాధాన్యత ప్రపంచ రాజకీయాల్లో మరోసారి రుజువు కానుంది.

ఈ టూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ..డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే ద్వైపాక్షిక చర్చలు(PM Modi US Visit) చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలుస్తుంది. ఇటీవల రష్యా నుంచి పెద్ద ఎత్తున ఇంధనం, గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించేలా ట్రంప్ ఒక చట్టంపైన సైన్ చేశారు.

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటవడంతో.. ఈ చట్టం మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో డిసెంబర్ సదస్సులో ట్రంప్‌తో మోదీ డైరెక్టుగా భేటీ కావడం, ఆయిల్ ట్రేడ్, ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై చర్చించడం దౌత్యపరంగా చాలా ఇంపార్టెన్స్‌ను సంతరించుకోబోతోంది. మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే ఇంపార్టెన్స్, వారిద్దరి మధ్య ఉన్న మంచి రిలేషన్‌ ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు ఇదే జీ20 వేదికగా భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల.. క్వాడ్ (QUAD) కూటమి నేతలు చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా టూర్ ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ కెనడాలో కూడా అడుగుపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంతో ఈ టూర్ ఉండొచ్చని, ప్రస్తుతం రెండు దేశాల మధ్య నడుస్తున్న సమగ్ర వాణిజ్య అగ్రిమెంట్‌పై ఇక్కడ ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

PM Modi US Visit
PM Modi US Visit

మొత్తానికి ప్రధాని మోదీ డిసెంబర్ టూర్(PM Modi US Visit) కేవలం ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వడం మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్ ఆంక్షల హెచ్చరికల నుంచి భారత ప్రయోజనాలను కాపాడుకోవడం, క్వాడ్ కూటమిని స్ట్రాంగ్ చేయడంతో పాటు గ్లోబల్ లీడర్‌గా భారతదేశపు ప్లేస్‌ను మరింత పటిష్టం చేసుకోవడాన్ని సూచిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ త్వరలోనే ఈ టూర్ తేదీలపై క్లారిటీ ఇవ్వనుంది.

Appreciation : మనసులోని మెచ్చుకోలును దాచుకోకండి..ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపండి..

Related Articles

Back to top button